Begin typing your search above and press return to search.

మూవీ మొఘ‌ల్ గా కీర్తినందుకున్న రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   28 May 2023 5:00 PM GMT
మూవీ మొఘ‌ల్ గా కీర్తినందుకున్న రాజ‌మౌళి
X
ఫిలింమేక‌ర్ డా.డి.రామానాయుడు ను మూవీ మొఘ‌ల్ అంటూ ప‌రిశ్ర‌మ కీర్తించింది. అత‌డి అజేయ‌మైన సినీ ప్ర‌యాణం ఎంద‌రికో స్ఫూర్తి. న‌టుడిగా నిర్మాత‌గా ద‌ర్శ‌కుడిగా రామానాయుడు విజ‌యాలు సాధించారు. ఆయ‌న త‌ర్వాత మూవీ మొఘ‌ల్ బిరుదు ను అంకిత‌మిస్తే అందుకు సిస‌లైన‌ అర్హుడు ఎవ‌రు? అన్న చర్చ భార‌త‌దేశంలో సాగుతోంది. ఎలాంటి సందేహం లేకుండా తెలుగు సినిమా కీర్తిప‌తాక‌ ను వినువీధిలో విహ‌రింప‌జేసిన రాజ‌మౌళికే ఆ బిరుదు ను అంకిత‌మివ్వాల‌ని అభిమానులు చెబుతున్నారు.

ఎందుకంటే RRR (2022)తో బాహుబలి చిత్రాల స్మారక విజయాన్ని రాజ‌మౌళి అనుసరించాడు. బాహుబ‌లి-బాహుబ‌లి 2- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో అంతర్జాతీయ స్టార్ డమ్ ని రాజ‌మౌళి అందుకున్నారు. 'నాటు నాటు...' గీతం సోషల్ మీడియాలో డ్యాన్స్ క్రేజ్ ను ప్రారంభించింది. హాలీవుడ్ మ‌న రాజ‌మౌళి ఫిల్మ్ మేకింగ్ సెన్స్ పై విస్మయం చెందింది.

ఇటీవ‌ల రాజ‌మౌళి పేరు పాన్-ఇండియా సినిమాకి పర్యాయపదంగా ఉంది. S.S. రాజమౌళి ఏదైనా ఒక సినిమా చేస్తున్నారు అంటే... దానికదే ఒక బ్రాండ్ గా మారిపోతోంది. రాజ‌మౌళి నుంచి ప్రతి మూడు నుండి నాలుగు సంవత్సరాల కు ఒకసారి సినిమా వస్తుంది.. కానీ ఆయ‌న సినిమా తీస్తున్నారు అంటే... నటీనటులు అతిధి పాత్రల కోసం రాజ‌మౌళి వ‌ద్ద క్యూలో నిలబడతారు. అలియా భట్ -అజయ్ దేవగన్ అందుకు ఉదాహ‌ర‌ణ‌లు.

ఇటీవ‌ల అమెరికన్ టాలెంట్ ఏజెన్సీ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో రాజ‌మౌలి ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో క్రాస్ ఓవర్ ఫిల్మ్ మేకర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. జపాన్ వంటి దేశాల్లో నెట్ ఫ్లిక్స్ లో RRR విజయం సాధించింది. ఇక్కడ హిందీ డబ్బింగ్ వెర్షన్ 2022లో అత్యధికంగా వీక్షించబడిన అంతర్జాతీయ టైటిల్ లలో ఒకటిగా నిలిచింది. ఇది రాజమౌళి ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చింది.

కామిక్ రిలీఫ్ 'అమర్ చిత్ర కథ' కామిక్స్ కాకుండా రాజమౌళికి విల్బర్ స్మిత్ నవలలు అంటే చాలా ఇష్టం. ''నేను అతని పెద్దరికాన్ని ప్రేమిస్తాను. అత‌డి క‌థ‌ల్లో భావోద్వేగాలు భారీ స్థాయిలో ఉంటాయి'' అని రాజ‌మౌళి చెప్పారు. ప‌రిశ్ర‌మ‌లో ఇద్ద‌రు అగ్ర హీరోల‌ ను క‌ల‌ప‌గ‌లిగే స‌త్తా రాజ‌మౌళికి మాత్ర‌మే ఉంది. ఇద్దరు తెలుగు సూపర్ స్టార్ లను స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి ఒప్పించిన అసాధార‌ణ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈగోల‌ కు తావు లేకుండా ఇరువురిని వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌ కు చూపించ‌డంలో రాజ‌మౌళి ప‌నిత‌నం ఆర్.ఆర్.ఆర్ తో బ‌య‌ట‌ప‌డింది. మునుముందు ఇండియ‌న్ సినిమా 'మూవీ మొఘ‌ల్'గా రాజ‌మౌళి ఒక్క‌డే అర్హ‌త‌ను క‌లిగి ఉన్నాడు అన‌డంలో సందేహం లేదు.