రెండు రోజులు స్నానం చేయని స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే అవాక్కే

Thu Jun 10 2021 08:00:01 GMT+0530 (IST)

The star heroine who has not bathed for two days

బాలీవుడ్ హీరోయిన్లలో స్టార్ హీరోయిన్లలో పరిణితీ చోప్రా ఒకరు. బొద్దుగా ఉండే ఈ భామ సినిమాల్లో రావటం కోసం స్లిమ్ గా తయారయ్యారు. గ్లామర్ పాత్రల విషయంలో మొహమాటం లేకుండా నటించే ఆమె.. సీన్ డిమాండ్ చేయాలే కానీ దేనికైనా సిద్ధమన్నట్లుగా ఆమె తీరు ఉంటుంది. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో పాత్రల కోసం నటీనటులు జీవించేస్తున్నారు. లావుగామారటం.. బక్కగా మారటం.. ఇలా ఎంతో కష్టపడుతున్నారు. అదే తరహాలో తాను చేసిన సాహసం గురించి వెల్లడించారు పరిణితీ చోప్రా. ఆమె నటిస్తున్న తాజా చిత్రం సందీప్ ఔర్ పింకీ పరార్ కోసం ఆమె రెండు రోజులు స్నానం చేయలేదట. ఒక సీన్ లో అత్యంత సహజంగా కనిపించాలన్న ఉద్దేశంతో తాను ఆ పని చేసినట్లు ఆమె చెప్పింది. సినిమాలోని కథ ప్రకారం అనుకోకుండా అబార్షన్ జరగటం.. కొన్ని రోజులు అదే షాక్ లో ఉండే సీన్లను అత్యంత సహజంగా తెరకెక్కించటం కోసం తానీ పని చేసినట్లు చెప్పారు.

ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గుడిసెలో ఈ సీన్లు మూడు రోజులు షూట్ చేశారని చెప్పారు. ఆ ప్రాంతం మొత్తం మరికిగా ఉండేదని.. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత కూడా స్నానం చేసేదాన్ని కాదని.. ఒళ్లంతా బురద అయ్యేదని.. అలానే ఉండి నేరుగా షూటింగ్ కు వచ్చానని.. సీన్ బాగా రావాలన్న ఉద్దేశంతో రెండు రోజులు స్నానం చేయలేదన్న పరిణితి చోప్రా మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. మరి.. ఆమె  కష్టం స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో చూడాలి.