స్క్రిప్టు రీడింగ్ సెషన్స్ లో స్టార్ హీరోయిన్ బిజీ

Thu Jun 24 2021 07:00:01 GMT+0530 (IST)

The star heroine is busy in script reading sessions

రెండు దశాబ్ధాల కెరీర్ లో మజిలీలెన్నో.. ఇంకా కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది కత్రిన. బాలీవుడ్ లో దేవతా సుందరి ఇమేజ్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం సల్మాన్ సరసన టైగర్ చిత్రంలో నటిస్తున్న ఈ సీనియర్ బ్యూటీ మరోవైపు సౌత్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సన్నాహకాల్లో ఉంది.కోవిడ్ 19 నుండి కోలుకున్న తర్వాత ఇటీవల తన ఫిట్నెస్ శిక్షణను తిరిగి ప్రారంభించిన కత్రినా కైఫ్.. సేతుపతి మూవీలో తన పాత్ర కోసం ప్రిపరేషన్ ప్రారంభించింది. ఈ చిత్రం కొంతకాలంగా హెడ్ లైన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తన పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దర్శకుడితో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లను కత్రిన ప్రారంభించింది. తన పాత్ర పరిధిని అర్థం చేసుకునేందుకు దర్శకుడితో కలిసి  మంతనాలు సాగిస్తున్న కత్రిన.. ప్రిపరేషన్ హీటెక్కిస్తోంది.

కత్రినా - విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నిడివి 90 నిమిషాలు ఉంటుందని తెలిసింది. 30 రోజుల షెడ్యూల్ లో పూర్తిగా తెరకెక్కనుంది. సల్మాన్ ఖాన్ - ఎమ్రాన్ హష్మీలతో టైగర్ 3 చిత్రీకరణ పూర్తయ్యాక కత్రిన  సేతుపతితో చిత్రీకరణను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత జూన్ లో షూటింగ్ ని స్టార్ట్  చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కత్రినా తదుపరి  ఫోన్ బూత్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్ సహనటి సూర్యవంశీ విడుదలకు సిద్ధమవుతోంది.