హీరోయిన్లను తగ్గిస్తున్న స్టార్ హీరో.. అదీ సంగతి!

Thu Sep 23 2021 17:00:01 GMT+0530 (IST)

The star hero who sets the minds of producers like that

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరూ 10కోట్ల లోపు పారితోషికానికి పని చేయడం లేదు. కొందరు సీనియర్ హీరోలు సక్సెస్ లేని రోజుల్లోనే 10 కోట్లు వసూలు చేసిన సందర్భాలున్నాయి. దీనిపై అప్పట్లో ఓ సీనియర్ హీరోపై రకరకాల కథనాలొచ్చాయి. చింత చచ్చినా పులుపు చావలేదు! ఏజ్ బార్ అయినా ఎక్కడా తగ్గడం లేదు!! అంటూ రకరకాలుగా ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వైరల్ అయ్యాయి.అయితే ఇప్పుడు ఆ హీరో సక్సెస్ అందుకుని మాంచి జోష్ మీద ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వేడి పెంచేస్తున్నాడు. ఈ సినిమాలకు కూడా పారితోషికంలో అతడు ఎక్కడా తగ్గడం లేదు. 10కోట్లు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే నిర్మాతల బడ్జెట్ తగ్గించడమెలా? అంటే ఆయన దానికి ఓ చిట్కా కూడా కనిపెట్టారట. ఇది చాలా తెలివైన చిట్కా అని కూడా గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమిటా చిట్కా? అంటే..

తనకు మాత్రమే పారితోషికం అడిగినంతా ఇవ్వాలి. ఇక స్టార్ హీరోయిన్లను తీసుకోవాల్సిన అవసరమేం లేదు. అప్పుడే పరిశ్రమలో ఎదిగేందుకు వచ్చిన కొత్త భామలు అయినా ఫర్వాలేదు.. ఇతర టెక్నీషియన్లను కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తే మంచిదే కదా! అనేది ఆయన చిట్కా అని తెలిసింది. అంటే హీరోయిన్లను ఇతరులను తగ్గించడం ద్వారా తన రెమ్యునరేషన్ కి కోత పడకుండా చూసుకుంటున్నాడన్నమాట. ఇక సినిమా విజయం సాధిస్తే 90శాతం క్రెడిట్ కూడా తన ఖాతాలోకే వేసుకోవడం ఖాయం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అతడు నటిస్తున్న రెండు సినిమాల్లో మొత్తం ముగ్గురు కొత్త కథానాయికలు కనిపిస్తున్నారు. డింపుల్ హయాతీ.. మీనాక్షి చౌదరి.. దివ్యాంశ కౌశిక్ లాంటి నవతరం నాయికలకు అతడు పిలిచి మరీ అవకాశాలిచ్చాడు. అలా నిర్మాతల మైండ్ ని కూడా తెలివిగా సెట్ చేశాడట. బావుందయ్యా చంద్రం!!