Begin typing your search above and press return to search.

నిముషాల సీన్ కోసం 6 నెలలు కష్టపడ్డ స్టార్ హీరో.. అందుకేనా?

By:  Tupaki Desk   |   10 July 2020 2:30 AM GMT
నిముషాల సీన్ కోసం 6 నెలలు కష్టపడ్డ స్టార్ హీరో.. అందుకేనా?
X
ఇండియన్ సినీచరిత్రలో కన్నడ ఇండస్ట్రీ నుండి ఒకే స్టార్ ఒకే సినిమాతో పాన్ ఇండియన్ హీరో అయిపోయాడు. ఆయనే యశ్. ఒక్కసారిగా కోలార్ గోల్డ్ ఫీల్డ్ సినిమాతో.. అదే 'కేజీఎఫ్' సినిమాతో తనలోని కసి అంతా బయట పెట్టాడు. 2018 డిసెంబర్ నెలలో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి పెద్ద సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200కోట్ల పైచిలుకు వసూల్ చేసిన మొదటి కన్నడ సినిమాగా కేజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 సినిమాకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్2 సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ సినిమా మళ్లీ దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పది నిముషాల సన్నివేశం కోసం హీరో యశ్ ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్నాడట. పది నిముషాల కోసం అంత డెడికేషన్.. హార్డ్ వర్క్ చూపిస్తే ఎంతటి బ్లాక్ బస్టర్ అయినా తలవంచక తప్పుతుందా.. అంటూ సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. దాదాపు రెండేళ్ళుగా కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త కాస్త గుర్తుంచుకోవాల్సిన విషయం చెప్పింది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ కరోనా వ్యాప్తి చెందటంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. అయితే యశ్ చేసిన పని మేకర్స్ మనసులను గెలుచుకుందట. ఇక యశ్ పక్కన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.