హరిహర వీరమల్లు.. ఓ పనైపోయింది!

Tue Oct 04 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

The shooting of this film will be completed as soon as possible

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా హరిహర వీరమల్లు పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గతంలో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ లో అయితే ఒక జోష్ కనిపించింది. కానీ ఆ తర్వాత మధ్యలో మళ్ళీ దర్శకుడు పనితనంపై అనేక రకాల రూమర్స్ రావడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవచ్చనే విధంగా కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరొక షెడ్యూల్ స్టార్ట్ చేయడంతో షూటింగ్ ఎప్పటిలానే చాలా హ్యాపీగా కొనసాగుతోంది అని అర్థమయింది.ఇక ఇటీవల దర్శకుడు అలాగే పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. సినిమాలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కోసం ముందుగా వర్క్ షాప్ పాల్గొంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ కు చెప్పడంతో పవన్ కూడా గత పది రోజుల నుంచి ఒక ప్రత్యేకమైన వర్క్ షాప్ లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిత్ర యూనిట్ కూడా ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చింది. ఈ వర్క్ షాప్ లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా పాల్గొన్నారు అంటే అందరూ ఎంత కలిసికట్టుగా వర్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికి వర్క్ షాప్ అయితే ఫినిష్ అయినట్లుగా కూడా దర్శకుడు కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే త్వరలోనే మరొక కొత్త షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు.

అక్టోబర్ 15 తర్వాత ఆ షెడ్యూల్ కు సంబంధించిన పనులు మొదలు కాబోతున్నాయి. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. త్వరలోనే సినిమాలోని ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే కీరవాణి సినిమాకు సంబంధించిన ట్యూన్స్ అన్నీ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమాను 2023 మార్చి నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.