Begin typing your search above and press return to search.

శృంగార నాయిక నుంచి అది కొట్టేసింద‌ట‌

By:  Tupaki Desk   |   5 Aug 2020 4:15 AM GMT
శృంగార నాయిక నుంచి అది కొట్టేసింద‌ట‌
X
దీపం ఉండగానే చ‌క్క‌బెట్టుకోవాలి! వ‌రుస సినిమాల‌తో జోరు చూపించిన‌ప్పుడే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆఫ‌ర్లు అందిపుచ్చుకోవాలి. క్రేజు మ‌స‌క‌బార‌క ముందే ఏదైనా! సినిమా ఆఫ‌ర్ అయినా.. బ్రాండ్ ప్ర‌మోష‌న్ అయినా కొన్నాళ్ల వ‌ర‌కే ఆ జోరు. ఈ సూత్రాన్ని బాగా అవ‌గ‌తం చేసుకుంది ఆ సౌత్ స్టార్ హీరోయిన్. అందుకే ఇప్పుడు ఓ లోదుస్తుల కంపెనీ ఆఫ‌ర్ ని కాద‌న‌లేక‌పోయింద‌ట‌.

అయితే శృంగార నాయిక‌గా పాపుల‌రైన ముంబై బ్యూటీ పూనమ్ పాండే నుంచి ఆ ఆఫ‌ర్ ని కొట్టేసింద‌ట‌. దీంతో పూన‌మ్ యాడ్ అండోర్స్ మెంట్ దోచేసిన సౌత్ క్వీన్ అంటూ ముంబై మీడియాలో ఠాంఠాం మోగుతోంది. పూనమ్ పాండే గత ఏడాది కాలంగా ఓ ఇన్నర్ వేర్ బ్రాండ్ కి ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఆ ఛాన్స్ సౌత్ కి చెందిన ప్ర‌ముఖ క‌థానాయిక ద‌క్కించుకుంది.

ఇంత‌కీ ఆ ఆఫ‌ర్ కొట్టేసింది ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే ఓ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. పూన‌మ్ ఆఫ‌ర్ కొట్టేసింది ఫ‌లానా స్టార్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. ఈ కాంట్రాక్టుతో ఆ అమ్మ‌డికి బాగానే ముడుపులు అందుతున్నాయ‌ట‌. బ్రేక్సలెంట్ అనే ఇన్ వోర్ బ్రాండ్ కి స‌ద‌రు హాట్ హీరోయిన్ సైన్ చేసింద‌న్న‌ది ఓ గుస‌గుస‌. సీకే బ్రాండ్ కి దిశాప‌టానీ ఎంత‌గా పాపులారిటీ పెంచిందో అలానే బ్రేక్స‌లెంట్ కి ఈ బ్యూటీ అంతే పెద్ద ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. ఇదే నిజ‌మైతే .. సోష‌ల్ మీడియాల్లో తుఫాన్ స్పీడ్ తో ఈ అమ్మ‌డికి కూడా ఫాలోవ‌ర్స్ పెర‌గ‌డం ఖాయ‌మే. ఇంత‌కీ ఎవ‌రీ సౌత్ క్వీన్ అనేది ఇంకా స‌స్పెన్స్. అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.