Begin typing your search above and press return to search.

#PUSHPA సుకుమార్ పై బ‌న్ని ప్రెజ‌ర్ నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   14 Oct 2020 11:30 PM GMT
#PUSHPA సుకుమార్ పై బ‌న్ని ప్రెజ‌ర్ నిజ‌మేనా?
X
ఒక్కోసారి మార్కెట్ వ‌ర్గాల్ని అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హీరోలు త‌మ ప్ర‌ణాళిక‌ల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అట్నుంచి ఒత్తిళ్లు అలానే ప‌ని చేస్తుంటాయి. అవి ఊహించ‌ని విధంగా ఉంటాయి. మా ఫేవ‌రెట్ హీరో సినిమా ఫ‌లానా సీజ‌న్ లో వ‌చ్చేస్తుంది అంటూ ఫ్యాన్స్ చేసే హంగామాకు త‌ల వొంచాల్సి ఉంటుంది. ఇక మార్కెట్ వ‌ర్గాల్లోనూ దానిపై ప్ర‌చారం సాగిపోతే ఆ టైమ్ కి రావాల‌ని కోరుకుంటారు.

ఇక‌పోతే అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి మాంచి దూకుడుమీదున్నాడు బ‌న్ని. అందుకే అత‌డు న‌టించే త‌దుప‌రి చిత్రం పుష్ప పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ క‌థ‌తో ఆర్య సుకుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో అంచ‌నాలు డ‌బుల్ అయ్యాయ‌నే చెప్పాలి. అందుకే ఈ మూవీ రిలీజ్ తేదీ విష‌యంలో చాలా ప‌ర్టిక్యుల‌ర్ గా ఉండాల్సిన స‌న్నివేశం ఎదుర‌వుతోంద‌ట‌.

వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ లో పుష్ప‌ని రిలీజ్ చేయాల్సిందిగా అల్లు అర్జున్ నుంచి సుకుమార్ కి ఫుల్ ప్రెజ‌ర్ ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే సుక్కు మాత్రం ద‌స‌రాకి లేదా వ‌చ్చే ఏడాది చివ‌ర్లో ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. బ‌న్నీ ప్లాన్ ప్ర‌కారం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ తో ఈ సినిమా షూటింగ్ ముగించేసుకుని ఆ వెంట‌నే కొర‌టాల శివ ప్రాజెక్ట్ కి గెటెప్ అండ్ లుక్ మార్చుకోవాల‌ను‌కుంటున్నాడ‌ట‌. ఆ ప్రాజెక్ట్ ని 2022 సంక్రాతికి టార్గెట్ చేయాల‌నేది బ‌న్ని ప్లాన్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప రిలీజ్ తేదీకి సంబంధించిన అప్ డేట్ బ‌న్ని లేదా సుకుమార్ అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా బ‌న్ని-సుక్కూ టీమ్ చిత్రీక‌ర‌ణ‌కు స‌మాయ‌త్త‌మైన సంగ‌తి విధిత‌మే. ఇకపై శ‌ర‌వేగంగా పూర్తి చేస్తేనే టార్గెట్ ని రీచ్ అయ్యేందుకు వీలుంటుంది.