షాకింగ్ ట్విస్టు: సల్మాన్ ఖాన్ పెళ్లాడకపోవడానికి కారణం!

Fri May 13 2022 23:00:01 GMT+0530 (IST)

The reason why Salman Khan did not get married

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో వరుస సన్నివేశాలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోసారి సల్మాన్ భాయ్ మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తున్నాడు. దానికి కారణం ఎఫైర్ కాదు.. ప్రేమాయణాలు కానేకావు.. ఇంకేమిటీ అంటే..? అతడి సోదరుడు సోహైల్ ఖాన్.ఇంతకుముందే ఒక సోదరుడు ఆర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా నుంచి 18 ఏళ్ల కాపురం అనంతరం విడిపోతున్నామని ప్రకటించి షాకిచ్చాడు. అనంతరం ఈ జంట విడాకులు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సోహైల్ ఖాన్ దాదాపు 24 ఏళ్ల కాపురం అనంతరం తన భార్య సీమాఖాన్ నుంచి విడిపోతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భాయ్ సోదరుల ఇద్దరి విడాకులు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.

ఇదే సమయంలో సల్మాన్ భాయ్ ఎందుకు పెళ్లాడలేదు? అంటూ అభిమానులు మరోసారి డిబేట్ స్టార్ట్ చేశారు. దానికి సమాధానం ఐశ్వర్య రాయ్ లేదా కత్రినా అసలే కాదు. ఇంకా చాలా సంగతులే ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇప్పటికీ ఒంటరిగా ఉండడానికి అసలు కారణం అతని మాజీ ప్రియురాలైన ఐశ్వర్యరాయ్ లేదా కత్రినా కైఫ్ లేదా సోమీ అలీ లేదా సంగీతా బిజ్లానీ కానే కాదు.. కానీ అతడి జీవితంలో మరో నటి దీనికి కారణం అన్న చర్చా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఐశ్వర్యరాయ్ తో బ్రేకప్ కావడమే దీనికి కారణమని సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ఒంటరిగానే ఉండటానికి కారణమిదేనని పలువురు ఆరోపించగా.. అసలు కారణం వేరే ఉంది. సల్మాన్ ఖాన్ గతంలో సంగీతా బిజ్లానీ నుండి సోమీ అలీ వరకు ఐశ్వర్య రాయ్ నుండి కత్రినా కైఫ్ వరకు మరికొందరితోనూ సంబంధాలలో ఉన్నారన్న కథనాలు వచ్చాయి.  అయితే సల్మాన్ ఖాన్ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.

ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రేఖ (67) తాను ఎక్కడికి వెళ్లినా సల్మాన్ తనను అనుసరిస్తాడని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సల్మాన్ గురించి ఇంకా ప్రస్థావిస్తూ రేఖ ఏమన్నారంటే.. అతడు మా పొరుగువాడు.. తనని చూడటానికి యోగా తరగతులకు హాజరయ్యేవాడని తెలిపారు.

చాలా కాలం క్రితం.. సల్మాన్ కూడా తనకు రేఖ అంటే పిచ్చి అని ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రేఖ కారణంగా తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని కూడా చెప్పాడు. ``బహుశా.. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు`` అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. పెళ్లిపై సల్మాన్ వ్యాఖ్యను తెలుసుకున్న రేఖ .. షాయద్ మేరిభి ఇసిలియే నహిన్ హుయీ... (అందుకే నాకు కూడా పెళ్లి కాలేదు) అని అనడం హాట్ టాపిక్ అయ్యింది.

సల్మాన్ భాయ్ .. నటి సంగీతా బిజ్లానీని పెళ్లి చేసుకోవాలనుకున్నానని 90వ దశకం ప్రారంభంలో ఇద్దరం ప్రేమలో ఉన్నామని సల్మాన్ ఒకసారి చెప్పాడు. ప్రముఖ వెబ్ పోర్టల్ ప్రకారం.. సల్మాన్ - సంగీత జంట వివాహ తేదీలను కూడా ఖరారు చేశారు. వారి పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయినట్లు సమాచారం. కానీ ఆ పెళ్లి జరగలేదు. సల్మాన్ జీవిత చరిత్రలో  జాసిమ్ ఖాన్ రాసిన బీయింగ్ సల్మాన్ లో ``సల్మాన్ .. సంగీత జంట 27 మే 1994న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.. కానీ అకస్మాత్తుగా ఈవెంట్ రద్దయింది`` అని వెల్లడించారు.

చాలా ఏళ్ల తర్వాత కరణ్ జోహార్ చాట్ షోలో తాను సంగీతను దాదాపు పెళ్లి చేసుకోబోతున్నానని.. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయని సల్మాన్ ఒప్పుకున్నాడు. కానీ సంగీత తనను వేరొక యువతితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందున సంగీత పెళ్లిని రద్దు చేసుకుంది.

ఇప్పుడు ఆర్భాజ్ ఖాన్ .. సోహైల్ ఖాన్ విడాకుల విషయంలోనూ ఎఫైర్ ప్రధాన పాత్ర పోషించిందని మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఎఫైర్ వల్ల సల్మాన్ కి పెళ్లి కాలేదు.. ఇద్దరు సోదరులకు విడాకులు అయ్యాయన్న గుసగుస ప్రధానంగా నెటిజనుల్లో వినిపిస్తోంది.