Begin typing your search above and press return to search.

నిరుపేద అమ్మాయిని డాక్టర్‌ చేసిన రియల్‌ హీరో

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:30 AM GMT
నిరుపేద అమ్మాయిని డాక్టర్‌ చేసిన రియల్‌ హీరో
X
తమిళ ట్యాలెంటెడ్‌ హీరో శివ కార్తీకేయన్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా కొన్ని మెప్పించాయి. కౌశస్య కృష్ణమూర్తి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పంచిన విషయం తెల్సిందే. శివ కార్తికేయన్‌ రీల్‌ లైఫ్‌ లో నే కాకుండా రియల్‌ లైఫ్‌ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఒక పేద ప్రతిభావంతురాలైన అమ్మాయి చదువుకు ఆర్థిక సాయం అందజేసి ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్‌ చదవడంలో శివ కార్తికేయన్‌ కీలక పాత్ర పోషించారు.

తంజావూర్‌ జిల్లా పేరావురణి కి సమీపంలో ఉండే ఒక చిన్న పల్లెకు చెందిన గణేషన్‌.. చిత్రల సంతానం సహానా. ఈమె పేరావురణి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్లస్‌ 2 వరకు చదువుకుంది. గజ తుఫాన్‌ సమయంలో ఇల్లు కూలిపోవడంతో వీధి దీపాల కింద కూర్చుని సహానా చదువుకుంది. ప్లస్‌ 2 లో 600 మార్కులకు గ ఆను 524 మార్కులు సాధించింది. తనకు డాక్టర్‌ అవ్వాలనే కోరిక ఉందని ఒక మీడియా సంస్థతో ఆమె తెలియజేసింది. సోషల్‌ మీడియాలో ఆ మీడియా సంస్థకు సంబంధించిన కథనం ను చూసిన శివ కార్తికేయన్‌ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చాడు.

సహానాను తంజావూర్‌ లోని నీట్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు కోసం శిక్షణ ఇప్పించాడు. అందుకు సంబంధించిన పూర్తి ఆర్థిక పరమైన సాయంను ఆయన అదించాడు. తాజాగా 273 మార్కులతో తిరుచ్చిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్ లో సీటును దక్కంచుకుంది. డాక్టర్‌ కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు సాయంగా నిలిచిన శివ కార్తికేయన్‌ గారిక ఎప్పటికి రుణపడి ఉంటాను అని.. ఆయన వల్లే తాను డాక్టర్‌ అవ్వగలుగుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక నిరుపేద డాక్టర్‌ అవ్వడంలో సాయంగా నిలిచిన శివ కార్తికేయన్‌ నిజంగా రియల్‌ హీరో అంటూ అంతా అభినందనలు కురిపిస్తున్నారు.