పవన్ కల్యాణ్ తో సినిమా అంత ఈజీ కాదు..!

Sat Mar 18 2023 12:26:45 GMT+0530 (India Standard Time)

The movie with Pawan Kalyan is not so easy

పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే మరింత ఖుషీ అయిపోతుంటారు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్లు అక్కడ మరికొన్నాళ్లు ఇక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్య వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అందులోనూ ఎక్కువ రీమేక్ త్వరగా అయిపోయే చిత్రాలకే ఓకే చెప్పారు. షూటింగ్ లలో కూడా పాల్గొన్నారు.కానీ ఏ ఒక్క చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఆయన షూటింగ్ చాలా ఆలస్యం అవుతుంటుంది. మిగిలిన హీరోల మాదిరిగా చకచకా చేయరు చేయలేరనే టాక్ ఉంది. అజ్ఞాత వాసి భీమ్లా నాయక్ సినిమాలకు పవన్ సన్నిహితుడు అయి ఉండి కూడా త్రివిక్రమ్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడో ఆ చిత్ర బృందానికి చాలా బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడం అంత వీజీ ఏం కాదు అన్నది హరిహర వీరమల్లు డైరెక్టర్ కు మరింత బాగా తెలుసు. సినిమాలు చేయాల్సిన టైంలో రాజకీయాలు రాజకీయాలు చేయాల్సిన టైంలో సినిమాలు పెట్టుకోవడం చాలా సమస్యలకు దారి తీస్తోంది.

ముఖ్యంగా పీపుల్స్ మీడియా పతాకంపై డైరెక్టర్ సముద్రఖని త్వరగా సినిమా పూర్తి చేయాలని వచ్చారు. నాన్ స్టాప్ గా చాలా వరకు చేశారు. ఈ నెలాఖరులో చిత్రం పూర్తవుతుంది అనుకుంటుండగానే షూటింగ్ కు బ్రేక్ పడింది. పార్టీ కార్యక్రమాల కోసం రెండు రోజులు వచ్చాక రెస్ట్ తీసుకోవడం కోసమంటూ మరో రెండు రోజులు ఎగిరిపోయాయి. మళ్లీ షూటింగ్ కోసం ప్లాన్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ శనివారం చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా... క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. శని ఆది సోమ ఒకే లొకేషన్ లో ప్లాన్ చేశారట.

కానీ పవన్ కల్యాణ్ మూడ్ బాలేక ఈరోజు ఆగిపోయింది. కనీసం రేపు అయినా షూటింగ్ జరుగుతుందో లేదో చూడాలి మరి. పెద్దగా కష్టపడాల్సిన సినిమా కాకుంటేనే ఇలా ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పాటలు ఫైట్లు ఇంకా చాలా ఉండే హరీష్ శంకర్ సినిమా చిత్రీకరణ ఎన్ని రోజులు సాగుతుందో ఎలా సాగుతుందో చూడాలి మరి. ఏది ఏమైనా పవర్ స్టార్ తో సినిమా చేయడం అంటే అంత వీజీ ఏం కాదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.