సినిమా చిన్నదే.. కానీ బడ్జెట్ భారీగా అవుతోందట!

Mon Jun 14 2021 13:00:02 GMT+0530 (IST)

The movie is small .. but the budget is getting bigger!

ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టారంటే మాములే కానీ ప్రస్తుతం ఓటిటి సినిమాలు.. వెబ్ కంటెంట్ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా రూపొందిస్తున్నారు. లాక్డౌన్ ముందువరకు సినిమాలు చేసినా ఇప్పుడు ఓటిటి సినిమాలు కూడా చేసేస్తున్నారు దర్శకులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ తో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు అప్ కమింగ్ హీరోలతో కూడా ఓటిటి సినిమాలు చేస్తున్నారు. అలాంటి దర్శకులలో ఒకరు డైరెక్టర్ మారుతీ. ఓవైపు భారీ సినిమా లైనప్ చేసాడు.మరోవైపు కుర్రహీరోతో ఓ చిన్నసినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే బోల్డ్ కాన్సెప్ట్ మూవీ 'ఏక్ మినీ కథ'తో ఫస్ట్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్.. ప్రధానపాత్రలో డైరెక్టర్ మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతుంది. ఓ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీని ఈ యువహీరోతో తక్కువ రోజుల్లో ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేసాడట మారుతీ. అయితే ఈ ప్రాజెక్ట్ చిన్న సినిమాగా మొదలు అయినప్పటికీ ఫేమ్ కలిగిన కాస్ట్ వచ్చేసరికి బడ్జెట్ కూడా అలాగే పెరుగుతోందని సమాచారం. ఈ సినిమాను యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

హీరో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ విధంగా యాక్టర్స్ - టెక్నికల్ టీమ్ కూడా పేరున్న వారు దొరికేసరికి సినిమా బడ్జెట్ కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఆల్రెడీ మీడియం స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించింది మెహరీన్. ఇప్పుడు వయసులో చిన్నవాడు అయినటువంటి కుర్రహీరోతో జోడి కట్టేసరికి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే కాకుండా మెహ్రీన్ చేతిలో ఎఫ్3 సినిమా ఉంది. చూడాలి మరి మళ్లీ ఈ రెండు సినిమాల తర్వాత నటిగా అమ్మడు బిజీ అవుతుందేమో.. ఇదిలా ఉండగా డైరెక్టర్ మారుతీ ఈ సినిమా తర్వాత హీరో గోపీచంద్ తో 'పక్కా కమర్షియల్' అనే సినిమా చేయనున్నాడు.