సలార్ రెండు పార్ట్ ల విషయం ఇంకా సస్పెన్స్ లోనే..!

Sat Dec 03 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

The matter of two parts of Salaar is still in suspense

కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సలార్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను విడుదల చేస్తాం అన్నట్లుగా మేకర్స్ ఆ మధ్య ప్రకటించారు. కానీ కరోనా ఇతర కారణాల వల్ల సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి జరగడం లేదు.ఇదే సమయంలో కేజీఎఫ్ 2 సినిమా తర్వాత సలార్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. వెయ్యి కోట్ల సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ ను కూడా అదే స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశ్యంతో అంతకు ముందు చేసిన కొన్ని సీన్స్ ను కూడా తొలగించి మళ్ళీ ఫ్రెష్ గా షూటింగ్ ను ప్రారంభించాడు అనే ప్రచారం జరిగింది.

మధ్య లో సలార్ ను రెండు పార్ట్ లుగా చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే కొన్ని సన్నివేశాలను జోడించి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆ సమయంలో కన్నడ సినీ వర్గాల నుండి కూడా ప్రశాంత్ నీల్ సలార్ ను రెండు పార్ట్ లు గా చేసే ఆలోచనతో ఉన్నాడు అనే వార్తలు వినిపించాయి.

ఇప్పటికి కూడా సలార్ రెండు పార్ట్ లుగా వస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సలార్ పార్ట్ ల గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. వచ్చే ఏడాది సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలు అయితే ఉన్నాయి.

సలార్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ప్రారంభం కాబోతుందట. కనుక సలార్ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేజీఎఫ్ రెండు పార్ట్ ల మధ్య గ్యాప్ రాలేదు. కనుక సలార్ ని ఒక వేళ రెండు పార్ట్ లు గా తీసుకు రావాలని ప్రశాంత్ నీల్ భావిస్తే గ్యాప్ ఇవ్వడు. అప్పుడు ఎన్టీఆర్ సినిమా కు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

కానీ ఎన్టీఆర్ తో వచ్చే ఏడాది చివర్లోనే సినిమా ఉంటుందని ప్రశాంత్ నీల్ కాంపౌండ్ నుండి లీక్ వస్తుంది. కనుక సలార్ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుంది అనే వార్తలు నిజం కాకపోవచ్చు అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఈ విషయమై స్పష్టత కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.