తాగుడుతో హీరోయిన్ డిప్రెషన్ .. ఆ తర్వాత ఏమైంది?

Mon Sep 20 2021 17:05:26 GMT+0530 (IST)

The heroine who got drunk and went into depression

రంగుల ప్రపంచంలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కథానాయికలు రకరకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్న వైనం తెలిసిందే. మహానటి సావిత్రికే అన్ని కష్టాలు. ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు ఆల్కహాలిక్ గా మారారు. మహానటితో పోల్చలేం కానీ.. కాస్త అటూ ఇటూగా శ్రుతిహాసన్ కూడా రకరకాల వ్యక్తిగత వృత్తిగత కారణాలతో ఆల్కహాలిక్ గా మారిన విషయం తెలిసినదే.టాలీవుడ్ లోకి చాలా గ్యాప్ తర్వాత శ్రుతి హాసన్ `క్రాక్` సినిమాతో మళ్లీ ట్రాక్ లో కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడి కెరీర్ మళ్లీ జోష్ అందుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ నాయికగా మారిపోయింది. కోలీవుడ్ ..టాలీవుడ్ లో బిజీ నాయికగా కొనసాగుతోన్న సమయంలో మైకెల్ కోర్సలే తో ప్రేమలో పడి సినిమాలను అశ్రద్ధ చేసింది. కొన్నాళ్ల పాటు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ విదేశీ బోయ్ ప్రెండ్ తోనే బిజీగా గడిపింది. సరిగ్గా `కాటమరాయుడు` తర్వాత ఏకంగా రెండేళ్లు ప్రియుడి కోసమే సమయాన్ని కేటాయించింది. ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఆ ఇద్దరి బంధం కొంత కాలం తర్వాత బ్రేకప్ జరిగింది.

అయితే అప్పటికే శ్రుతి హాసన్ కి కొన్ని దురలవాట్లు ఉన్నట్లు మీడియా ప్రచారంలో ఉంది. స్మోకింగ్... ఆల్కాహాల్ సేవించడం వంటి విషయాల్లో శ్రుతి స్పీడ్ గానే ఉండేదని కోలీవుడ్ మీడియాలో కథనాలు వేడెక్కించాయి. అయితే బ్రేకప్ తర్వాత పూర్తిగా ఆల్కాహాలిక్ గా మారిపోయింది. ఆ మత్తు నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందని అంటున్నారు. మద్యానికి బానిసై ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందిట. ఆ సమయంలో ఏం చేయలో తొచలేదని.. జీవితమే శూన్యంగా కనిపించిదిట. దీంతో ఆ తర్వాత శ్రుతి హాసన్ ఆల్కహాల్ మానే విషయంలో థెరఫీ తీసుకున్నట్లు వెల్లడిచింది.

థెరఫీ కారణంగా డిప్రెషన్ నుంచి బయట పడినట్లు శ్రుతి హాసన్ తెలిపింది. మునుపటి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి యోగా.. థెరపీలు ఎంతో మేలు చేస్తాయని తెలిపింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ముంబైకి చెందిన సంతను హజారికాతో డేటింగ్ లో ఉన్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు సన్నిహితంగా మెలుగుతున్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేసాయి. విదేశీ టూర్లు..ముంబై విధుల్లో షికార్లకు సంబంధించిన కొన్ని వీడియోలు..ఫోటోలు కూడా లీకైన సంగతి తెలిసిందే. నెమ్మదిగా శ్రుతి తిరిగి కోలుకుంటోంది. మరోవైపు కెరీర్ పరంగానూ దూకుడుగా ముందుకు సాగుతోంది.