హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. దాడిచేసిన మహమ్మారి!

Sun May 16 2021 15:42:22 GMT+0530 (IST)

The heroine house is a serious tragedy

కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. సన్నిహితులను దూరం చేసి మరెంతో మందికి కన్నీళ్లు మిగిల్చింది. చూస్తుండగానే ఆత్మీయులంతా వదిలి వెళ్లిపోతున్నారని చిరంజీవి ఈ మధ్యనే ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా.. టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట విషాదం నెలకొంది.కరోనాతో పాయల్ ఆంటీ అనిత కన్నుమూశారు. తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి ఆమె. దీంతో.. పాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తరన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎంతగానో ప్రేమించే ఆంటీ లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నానని అన్నారు పాయల్.

‘‘మీరు ఇకపై నా పక్కన ఉండరు. కానీ.. నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటారు. నాకు ఊపిరి ఆడటం లేదు ఆన్న మీ మాటలు ఇప్పటికీ మరిచిపోలేకున్నాను. అవకాశం ఉంటే.. కరోనాను అంత చేయాలని ఉంది.’’ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది పాయల్.

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మూడు లక్షలపైనే కేసులు నమోదయ్యాయి. 4 వేల మందికిపైగా చనిపోయారు. ఆక్సీజన్ లభించక రెమ్ డెసివర్ వంటి మందులు లభించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.