Begin typing your search above and press return to search.

ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్.. పారి శోధ‌న ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 4:19 AM GMT
ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్.. పారి శోధ‌న ఫ‌లించేనా?
X
పారి అలియాస్ ప‌రిణీతి .. పరిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. బాలీవుడ్ హాట్ గాళ్ ప్ర‌స్తుతం హైద‌రాబాదీ బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ సినిమాతో పాటు ప‌లు క్రేజీ చిత్రాల‌తో ప‌రిణీతి బిజీ బిజీ.

`ది గర్ల్ ఆన్ ది ట్రైన్` అనే 2016 అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ లోనూ పారి న‌టిస్తోంది. పౌలా హాకిన్స్ ప్రసిద్ధ నవల ఆధారంగా టేట్ టేలర్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రానికి రీమేక్ ఇది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 26 న ఈ ఒరిజిన‌ల్ మూవీ స్ట్రీమింగుకి వ‌స్తోంది. పరిణీతి చోప్రా ఇందులో ప్రధాన పాత్రధారి. అదితి రావు- కిరిత్ కుల్హారీ - బుల్బుల్ ఫేమ్ అవినాష్ తివారీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఒరిజినల్ మూవీలో ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్ర పోషించ‌గా అదే పాత్ర‌లో పారి అద్భుతంగా అభిన‌యించింద‌ని తాజా టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. విధ్వంసకర విన్యాసాల‌తో పారీ కెరీర్ బెస్ట్ పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని టీజ‌ర్ వెల్ల‌డిస్తోంది. ఒక‌ తప్పిపోయిన వ్య‌క్తి దర్యాప్తులో ప్రధాన పాత్ర ప‌య‌నం ఎలా సాగింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఎలివేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అథితి రావు హైదారీ ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నారు.