రేప్ చేసే టైంకి అమ్మాయి బోరున ఏడ్చేసింది.. నాకేం అర్ధం కాలేదు: యాక్టర్ అజయ్

Thu Jun 10 2021 16:00:01 GMT+0530 (IST)

The girl cried at the time of the rape scene .. I did not understand why: Actor Ajay

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా పాపులర్ అయిన నటులు అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు. అలా కెరీర్ ప్రారంభం నుండి విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చినటువంటి యాక్టర్స్ సమయం సందర్బం వచ్చినప్పుడు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ బయట పెడుతుంటారు. ఆ విషయాలు బయటపెట్టడం కూడా ఇంటర్వ్యూల్లో మాత్రమే జరుగుతుంది. ఇన్నేళ్లు సినిమాలో విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఓ పాపులర్ యాక్టర్.. తనకు ఎదురైన ఇబ్బందికరమైన సందర్భాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ యాక్టర్ ఎవరో కాదు అజయ్. తెలుగు ప్రేక్షకులకు అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 18ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నాడు.కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తన లైఫ్ గురించి ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో హాజరై చాలా విషయాలు చెప్పాడు. అయితే అన్ని విషయాలు అడుగుతూనే మధ్యలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ఇంత సిగ్గుపడే మీరు మీ కెరీర్ లో రేప్ సీన్స్ ఎలా చేశారు? అనే ప్రశ్నకు అజయ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అయితే అజయ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఒకే ఒక్క రేప్ సీన్ చేసినట్లు గుర్తు. అదికూడా శ్రీహరి గారు హీరోగా చేసిన 'మహాలక్ష్మి' అనే సినిమాలో చేసాను. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ రేప్ సీన్ ఉంది. ఆ సీన్ కోసం ఓ మోడల్ ను పిలిపించారు. నాకు రేప్ సీన్ అని చెప్పారు. నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. కానీ ఆ మోడల్ కు రేప్ సీన్ అనే విషయం చెప్పలేదు డైరెక్టర్ విజయన్ గారు. టైం అయింది.

ఆ మోడల్ షాట్ లోకి వచ్చింది కానీ ఏం సీన్ అనేది ఆమెకు తెలియదు. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పారు కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు. సార్ ఆ మోడల్ కి సీన్ చెప్పకుండా ఎలా సార్.. అనేలోపు ఆమె బావురుమని ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ వెంటనే నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. సార్ ఇలాగైతే నేను చేయలేను అన్నాను. కానీ ఆ టైంలో మోడల్ కు సీన్ ఎక్సప్లయిన్ చేసి ఎలాగో చేసేసాం.. అయితే నా కెరీర్ లో ఎక్కువగా రేప్ సీన్స్ రాలేదు. చాలా హ్యాపీ." అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు అజయ్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అజయ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ మేటర్ ఉండి క్వాలిటీ సినిమాలు మాత్రమే చేయాలనీ ఉందన్నాడు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కనిపించనున్నట్లు హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం అజయ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.