Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ న‌టిస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ

By:  Tupaki Desk   |   29 Sep 2020 7:50 AM GMT
ప‌వ‌ర్ స్టార్ న‌టిస్తున్న మొద‌టి పాన్ ఇండియా మూవీ
X
ప్ర‌స్తుతం వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ప్ర‌భాస్ .. రానా త‌ర‌హాలోనే మ‌హేష్ .. తార‌క్.. చ‌ర‌ణ్ .. బ‌న్ని వీళ్లంతా పాన్ ఇండియా సినిమాల‌పైనే గురి పెడుతున్నారు. చ‌ర‌ణ్ - తార‌క్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ పూర్త‌య్యాక కూడా మ‌రో పాన్ ఇండియా సినిమా చేయాల‌న్న తాప‌త్ర‌య‌మే క‌నిపిస్తోంది. ఇంత‌కుముందుతో పోలిస్తే యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల్ని ఎంచుకుని ఇరుగు పొరుగు మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టాల‌నే కృషి చేస్తున్నారు.

అయితే పాన్ ఇండియా రేసులో చేరిన తొలి వెట‌ర‌న్ స్టార్ గా చిరంజీవి రికార్డుల‌కెక్కారు. కానీ త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ పాన్ ఇండియా రేసులో వినిపించ‌లేదు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లాంటివి అనువాదాలై ఇత‌ర భాష‌ల్లోకి వెళ్లినా కానీ.. డైరెక్ట్ పాన్ ఇండియా మూవీలో ప‌వ‌న్ న‌టించ‌లేదు.

అయితే ప‌వ‌న్ తో క్రిష్ తెర‌కెక్కిస్తున్న హిస్టారిక‌ల్ మూవీని పాన్ ఇండియా మూవీ రేంజులోనే తెర‌కెక్కిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నా అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ అయితే లేదు. క్రిష్ ఎంచుకున్న కాన్సెప్ట్ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న‌ది. కోహినూర్ వ‌జ్రం త‌స్క‌ర‌ణ‌.. రాబిన్ హుడ్ త‌ర‌హా దోపిడీ అంటూ కంటెంట్ లీక‌వ్వ‌డంతో పాన్ ఇండియా మూవీ అంటూ ప్ర‌చార‌మైంది. అయితే ఈ సినిమాకి ఉప‌యోగించే విజువ‌ల్ గ్రాఫిక్స్.. ఎఫెక్ట్స్ .. బ‌డ్జెట్ స్పాన్ .. తారాగ‌ణం ఇవ‌న్నీ పాన్ ఇండియా అప్పీల్ నివ్వాల్సి ఉంటుంది. ఇంత‌కీ బ‌డ్జెట్ ఎంత‌? అన్న‌ది నిర్మాత‌లు స్ప‌ష్ఠంగా రివీల్ చేస్తేనే ఇది పాన్ ఇండియా మూవీనా కాదా చెప్ప‌గ‌ల‌రు. అయితే ఈ మూవీని తెలుగు-త‌మిళం -హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ ఉంద‌న్న‌ది మాత్రం సుస్ప‌ష్ఠం. ఇక ఈ మూవీ త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌య్యారు. వాటిలోనూ పాన్ ఇండియా ఉంటుందా లేదా? అన్న‌ది ఆయ‌నే చెప్పాలి.