Begin typing your search above and press return to search.

ది ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్... ఘట్టమనేని కృష్ణ..!

By:  Tupaki Desk   |   31 May 2023 3:48 PM GMT
ది ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్... ఘట్టమనేని కృష్ణ..!
X
అప్పటికే ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ లు స్టార్స్ గా అఖిలాంధ్ర ప్రేక్షకుల ను మెప్పిస్తున్నారు. శోభన్ బాబు కూడా హీరో గా సినిమాలు చేస్తున్నారు. ఆ టైం లో ఇండస్ట్రీకి తేనె మనసులు సినిమా తో పరిచయమయ్యారు సూపర్ స్టార్ కృష్ణ. ఆ సినిమా హిట్ అవడంతో వరుస ఛాన్స్ లు అందుకున్నారు. ఇక హీరో గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక ప్రేక్షకులకు ఇలా రెగ్యులర్ సినిమాల ను కాదు కొత్తగా ఏదైనా చూపించాలని తెలుగు తెర మీద ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన.

ఇండియన్ హిస్టరీ లో జేమ్స్ బాండ్, కౌబోయ్ సినిమాలు మొదట చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ గారిదే. తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికత ను తెచ్చిన కృష్ణ గారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. హిట్ కొట్టినప్పుడే కాదు సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోతే ఆ నిర్మాతలకు మరో సినిమా చేయడం కూడా కృష్ణ గారు చేశారు.

అందుకే ఆయన్ను నిర్మాతల హీరో అంటారు. సినిమాల పరంగా పోటీ ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఆయన అందరు హీరోల తో చాలా మంచి సత్సంబంధాలు కొనసాగించారు. నీ వల్ల కాదు అన్న పనిని చేసి చూపించడం కృష్ణ గారికి అలవాటు. అలా ఎన్నోసార్లు తన సత్తా చాటారు. ఇక కమర్షియల్ హీరో కాషాయ దుస్తులు ధరించి అల్లూరి సీతారామ రాజు సినిమా చేస్తే అసలు చూస్తారా అన్న డౌట్ ఉన్నా సరే కథను కంటెంట్ ని నమ్మి సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని అల్లూరి సీతారామరాజు ఘన విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ.

ఆయన చేసిన సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక మార్గదర్శం.. ఆయన వేసిన అడుగులు ఎంతోమంది దర్శకులకు స్పూర్తి.. ఆయన వేసిన బాట సినీ మేకర్స్ కు పూల బాట. ఇలా ఒకటా రెండా సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడి.. సినిమా హీరో గానే కాదు మంచి మనసున్న మంచి వ్యక్తిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు కృష్ణ. గత సంవత్సరం పుట్టినరోజు ఆయన మనతో ఉన్నారు.

లాస్ట్ ఇయర్ నవంబర్ 15న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహా మనిషిని తలచుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన్ను మరొకసారి గుర్తుచేసుకుంటూ నివాళి అర్పిస్తుంది తుపాకి.కామ్. సూపర్ స్టార్ కృష్ణ లెగసీ ని ఆయన వారసుడు మహేష్ కొనసాగిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నాడని చెప్పొచ్చు.