సందడి చేస్తున్న గీతా వారి నేనే వస్తున్నా పాట

Sun Sep 25 2022 17:27:06 GMT+0530 (India Standard Time)

The ecstatic second single Oke Oka Oorilona from Dhanush Nene Vasthunna is here

తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువెన్' చిత్రంను తెలుగు లో గీతా ఆర్ట్స్ వారు డబ్ చేసి విడుతల చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.వీరిద్దరి కాంబోలో చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా ఇదే అవ్వడంతో తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక్కడ భారీ అంచనాలు పెంచేందుకు గీతా ఆర్ట్స్ వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి.

"నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది అనే విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు వారి కాంపౌండ్ నుండి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఒకే ఒక ఊరిలోనా.. అనే పాటను విడుదల చేయడం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి పాటకు సాహిసత్యంను చంద్రబోస్ అందించారు. "పాముల్లోనా విషముంది పువ్వులోని విషముంది పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది మృగములో మానవత ఉంటుంది" అంటూ సాగే లైన్స్ ప్రేక్షకుల యొక్క ఆసక్తి ని పెంచుతున్నాయంటూ కామెంటస్ వస్తున్నాయి.  

ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా  ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్ దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈనెల చివరి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.