అల్లు అర్జున్ గురించి కీలక విషయాలు బయటపెట్టిన డ్రైవర్..!

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

The driver who revealed the key facts about Allu Arjun

సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల గురించి తెలియాలంటే నేరుగా వారినే అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారిని అభిమానించే వారు లేదా సన్నిహితులను అడిగినా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ స్టార్ హీరోల మనస్తత్వం - మర్యాదలు - మంచితనం గురించి తెలుసుకోవాలంటే మాత్రం వారి దగ్గర పనిచేసే వారిని అడిగితే సరిపోతుంది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆయన డ్రైవర్ లక్ష్మణ్ పలు కీలక విషయాలను బయటపెట్టాడు. నిజానికి లక్ష్మన్ హీరో అల్లు అర్జున్ కు వీరాభిమాని. ఖాళీ ఫేవరేట్ హీరోతో ఫోటో దిగితే చాలు అనుకున్నవాడు ఏకంగా ఇప్పుడు ఆయన రధసారథిగా పని చేస్తున్నాడు.ఇలాంటి అవకాశం అందరికి రాదు. కానీ అవకాశం దక్కితే మాత్రం వదులుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. ఎందుకంటే అభిమాన తారలను రోజు కలవడం అంటే మాములు హ్యాపీనెస్ కాదు. అయితే రెండేళ్ల కిందట అల్లు అర్జున్ ఏడు కోట్లు ఖర్చుపెట్టి ఏకంగా న్యూ మోడల్ క్యారవాన్ చేయించుకున్న విషయం తెలిసిందే. దాని గురించి ఆల్రెడీ ఇదివరకే చాలా ఫోటోస్ వీడియోస్ చూసాం. ఇంట్లో కంటే బెటర్ లగ్జరీగా అల్లు అర్జున్ తన క్యారవాన్ తయారు చేయించుకొని వార్తల్లో నిలిచారు. తాజాగా అల్లు అర్జున్ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. తన శాలరీ గురించి కూడా నోరువిప్పాడు.

'నిజానికి బయట ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ నేను బయట పొందేదానికంటే బెటర్ శాలరీ అల్లు అర్జున్ ఇస్తున్నారు. కానీ శాలరీ ఏం పొందుతున్నాను.. అనేదానికంటే కూడా నేను హ్యాపీగా ఉండే విషయం ఏంటంటే.. నేను నా అభిమాన హీరో అల్లు అర్జున్ కోసం పనిచేయడం. ఒకసారి ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకునే వాడిని కానీ ఇప్పుడు ఆయనతో కలిసి.. ఆయన కోసం పని చేయడం నాకు చాలా పెద్ద విషయం. నిజానికి అలవైకుంఠపురంలో సక్సెస్ తరవాత ఎవరు ఊహించని బోనస్ ఇచ్చారు బన్నీ. మేం చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్సపెక్ట్ చేయని గిఫ్ట్ అది. మేమెప్పుడూ అడగలేదు కానీ ఆయన ఇచ్చి మమ్మల్ని హ్యాపీ చేశారు" అంటూ చెప్పుకొచ్చాడు లక్ష్మణ్. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.