సినిమాలు చేయకపోయినా వాళ్లకు జీతం ఇస్తున్న డైరెక్టర్..!

Sat Mar 18 2023 10:38:32 GMT+0530 (India Standard Time)

The director is paying them even if they don't make films..!

సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ ఇప్పుడు కాదు దశాబ్దం క్రితమే పాన్ ఇండియా సినిమాలతో అలరించారు. మురుగదాస్ సినిమా అంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటాయి. ఆయన చేసిన సినిమాలు రీమేక్ అయ్యి కూడా సక్సెస్ సాధించాయి. అయితే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా బ్యాడ్ టైం రాక తప్పదు. ప్రస్తుతం మురుగదాస్ కూడా అదే బ్యాడ్ టైం నడుస్తుంది. కత్తి లాంటి సూపర్ హిట్ అందుకున్న మురుగదాస్ ఆ తర్వాత తెలుగులో స్పైడర్ తీసినా వర్క్ అవుట్ కాలేదు.విజయ్ తో సర్కార్ చేశాడు అది యావరేజ్ గానే నిలిచింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2020లో దర్బార్ రాగా 3 ఏళ్లుగా మురుగదాస్ ఒక్క సినిమా చేయలేదు. లాస్ట్ ఇయర్ త్రిష రాంగీ సినిమాకు కథ అందించారు మురుగదాస్. ఇదిలాఉంటే 3 ఏళ్లుగా తను ఖాళీగా ఉంటున్నా తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్స్ కి మాత్రం నెల జీతం క్రమం తప్పకుండా ఇస్తున్నాడట మురుగదాస్.

డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసే వాళ్లు.. ఆయన సినిమా చేసేంతవరకు శాలరీ లాంటిది ఇస్తారు. కానీ మురుగదాస్ మాత్రం తాను సినిమా చేసినా చేయకపోయినా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ కి శాలరీస్ ఇస్తున్నాడట. నెల వారి ఖర్చులు లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలిసిందే. అందుకే మురుగదాస్ వారికి సినిమా చేస్తున్న టైం లో ఇచ్చినట్టే క్రమం తప్పకుండా శాలరీ వేస్తున్నాడట. సినిమాల్లోనే మంచి చెప్పడం కాదు అది నిజ జీవితంలో మనం కూడా ఆచరించాలి.

మురుగదాస్ అదే పని చేస్తున్నారు. అసిస్టెంట్ కి శాలరీ ఇవ్వడం గొప్ప విషయమా అని అనొచ్చు. సినిమా చేసే టైం లోనే ఏ డైరెక్టర్ అయినా తన అసిస్టెంట్ డైరెక్టర్స్ కి శాలరీలు ఇస్తున్నాడు. అది కూడా నిర్మాత ఇచ్చే ఎమౌంట్ లోనే వారి శాలరీస్ ఇస్తారు. కానీ మురుగదాస్ మాత్రం తన టీం కి జేబుల్లోంచి శాలరీస్ ఇస్తున్నాడట. మురుగదాస్ లాంటి వారు చాలామంది ఉన్నారు. వారు సినిమా తీయకపోయినా సరే వారి దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కి శాలరీస్ ఇస్తూ వారికి సపోర్ట్ గా ఉంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.