ఏదో అనుకుంటే.. ఇంకేదోలా ఉందట!

Mon May 25 2020 12:30:39 GMT+0530 (IST)

The crores of Money Waste For Top Producer

అదో పెద్ద స్టార్ హీరో చేస్తున్న రీమేక్ సినిమా. హీరో ఇమేజ్ పేరిట ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ తెలుగు నేటివిటీ టచ్ ఇస్తున్నారట.  ఈ సినిమాపై నిర్మాతగారు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారట.  అయితే ఈ మధ్య ఓ విషయంలో మాత్రం నిర్మాతకు భారీ షాక్ తగిలిందట.ఈ సినిమాలో హీరో గారి ఎలివేషన్ కోసం ఒక సూపర్ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేశారట. జస్ట్ ఈ యాక్షన్ బ్లాక్ కోసమే కోటి రూపాయలు ఖర్చు పెట్టారట.  షూట్ జరిగే సమయంలో ఆన్ లైన్ ఎడిటింగ్ లో చూసుకున్నప్పుడు ఆ ఫైట్ సూపర్ గా అనిపించిందట.   అయితే ఇప్పుడు రియల్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసుకుంటే మాత్రం అది ఛండాలంగా ఉందట.  ఆ ఫైట్ అలానే ఉంచితే హీరోయిజం ఎలివేషన్ సంగతి దేవుడెరుగు.. ట్రోలింగ్ తప్పదనిపించిందట.

దీంతో ఆ ఫైట్ సీక్వెన్స్ ను సినిమాలో ఉంచాలా వద్దా అని నిర్మాతగారు తలపట్టుకుని కూర్చున్నారట. ఆప్పుడు బాగుందే.. ఇప్పుడెందుకు అదోలా ఉంది.. కోటి రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనా అంటూ ఆయన మధనపడుతున్నాడట.  డబ్బు ఖర్చు పెట్టకుండా ఉంటే సరే కానీ ఇలా భారీగా డబ్బు పెట్టి కూడా రిజల్ట్ సరిగా లేకపోతే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది.