Begin typing your search above and press return to search.

యూట్యూబ్ రికార్డుల కు పెట్టే ఖర్చు.. షాక్ ఇస్తోంది గా!

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:58 AM GMT
యూట్యూబ్ రికార్డుల కు పెట్టే ఖర్చు.. షాక్ ఇస్తోంది గా!
X
ఒక వ్యక్తి విలువను ఎలా గుర్తిస్తారు? గతంలో ఎలా గుర్తించేవారో ఏమో కానీ ఇప్పుడు మాత్రం సంపాదనను బట్టే గుర్తిస్తారు. మీ సంపాదన ఎక్కువ అయితే మీరు బీకాం ఫిజిక్స్ అయినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అదే సంపాదన సరిగా లేకుండా మీరు న్యూక్లియర్ సైంటిస్ట్ లేదా సమాజసేవకులు అయినా సమాజం దృష్టిలో జఫ్ఫా కిందే లెక్క! ఇలాంటి పెరామీటర్స్ ప్రతి విషయానికి ఉంటాయి. సినిమాల విషయానికి వస్తే కలెక్షన్లు. అదే సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ విషయమే తీసుకుంటే యూట్యూబ్ వ్యూస్.

ఈ యూట్యూబ్ వ్యూస్ రికార్డులకోసం హీరోలు.. అభిమానులు పట్టుబడుతున్నారని గత కొంతకాలంగా టాక్ ఉంది. వీటివల్ల ఏం ఒరుగుతుందో.. ఎంత మేరకు కలెక్షన్స్ వస్తాయో ఇప్పటివరకూ సరిగ్గా తేల్చే విధానం మాత్రం అందుబాటులో లేదు కానీ యూట్యూబ్ రికార్డులపై మోజు మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇది ఒక చోట ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఒక మిలియన్ గొప్ప అనుకుంటే తర్వాత 10 మిలియన్లు గొప్ప అయింది. ఇప్పుడు 100 మిలియన్స్ గొప్ప.

ఇది ఇంతటి తో ఎలా ఆగుతుంది.. రేపు మరో స్టార్ హీరోకు 1000 మిలియన్స్ వ్యూస్ గొప్ప అవుతుంది. ఈ వేలంవెర్రికి వెంపర్లాటకు అంతెక్కడ? ఈ రికార్డుల పరంపరకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది? వాటంతట అవి వస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాతకు నష్టం ఉండదు. కానీ ఇలా ప్రమోషన్ ఖర్చుతో వస్తే అవన్నీ రియల్ రికార్డులు ఎలా అవుతాయి? దీంతో నిర్మాతలకు చేతి చమురు కాస్త ఎక్కువగానే వదులుతోందని అంటున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన.. రిలీజ్ కాబోయే సినిమాల టీజర్.. పాటలకు యూట్యూబ్ ప్రమోషన్ కు పెట్టిన ఖర్చు గురించి కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి. ఈ లెక్కలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి.

మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు యూట్యూబ్ ప్రమోషన్ కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు ఇది. ఒకసారి చూడండి. అంకెలు అన్నీ రూపాయల్లోనే..

సాహో: 1 కోటి(ప్యాన్ ఇండియా ప్రమోషన్స్)

సరిలేరు నీకెవ్వరు: 45 లక్షలు(టీజర్ ప్రమోషన్ )

అల వైకుంఠపురములో: 23 లక్షలు(ఒక పాట ప్రమోషన్)

రూలర్: 14 లక్షలు (టీజర్.. ఒక పాట కలిపి ప్రమోషన్)

ప్రతిరోజూ పండగే: 11 లక్షలు (ఒక పాట ప్రమోషన్)

నిశ్శబ్దం: 12 లక్షలు (టీజర్ ప్రమోషన్)