Begin typing your search above and press return to search.

షాక్: నటిని ఎత్తమంటే ఈ రేంజ్ లోనా?

By:  Tupaki Desk   |   11 Jun 2021 2:30 AM GMT
షాక్: నటిని ఎత్తమంటే ఈ రేంజ్ లోనా?
X
తాపీగా కూర్చున్న ఫొటోను నటి పవిత్రలక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే క్యాప్షన్ గా 'నన్ను పైకి తీసుకెళ్లండి' అని రాసుకొచ్చింది. ఇలా నటియే కోరితే నెటిజన్లు ఊరుకుంటారా? ఓ ఆట ఆడేసుకున్నారు.బుల్లితెర నటి పవిత్రలక్ష్మిని నెటిజన్లు మీమ్స్ తో ఎత్తిపడేశారు. . ఆమె షేర్ చేసిన ఫొటో మీద మీమ్స్ క్రియేట్స్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.

నెటిజన్లు తమ క్రియేటివిటీని అంతా జోడించారు. గాల్లో ఎగిరే వాహనాల మీద పవిత్ర కూర్చున్నట్టు కొందరు ఎడిట్ చేశారు. ఇక కొందరు కూలీలు బస్తాను ఎత్తినట్టుగా పవిత్రను ఎత్తినట్టుగా డిజైన్ చేశారు. కొందరు పవిత్రను ఎత్తి పడేసినట్లుగా సృష్టించారు. ఇలా పవిత్ర ఫొటోతో చాలా మంది రకరకాలుగా ఎడిట్ చేసి మీమ్స్ సృష్టించి ఆమె కోరిక తీర్చారు.

అయితే నెటిజన్ల మీమ్స్ చూసి నటి పవిత్ర షాక్ అయ్యింది. ఈ రేంజ్ లోనా అంటూ నవ్వేసింది.'కూకూ విత్ కోమలి' అనే షోతో బుల్లితెరపై పవిత్రలక్ష్మీ ఫేమస్ అయ్యింది. పలు షార్ట్ ఫిలింలలో నటించిన ఈమె ‘ఉల్లాసం' అనే మలయాళ చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో సందడి చేసింది.