పవర్ స్టార్ ని నవ్వించిన ట్రైలర్!

Fri Aug 12 2022 16:04:40 GMT+0530 (IST)

The Trailer made Power Star laugh

పలాస 1978 శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసకున్నారు దర్శకుడు కరుణ కుమార్. ఈ రెండు సినిమాల తరువాత ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం'కళాపురం'. జీ స్టూడియోస్ ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.ఇక్కడ అందరూ కళాకారులే అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఇదొక మధ్య తరగతి మనుషుల కథ. ప్రస్తుత సమాజంపై సెటైరికల్ గా ఈ మూవీని తెరకెక్కించారు.

ఈ మూవీలోని కీలక పాత్రల్లో సత్యం రాజేష్ సంచిత పూనాచ కాషిమ రఫీ చిత్రం శ్రీను రుద్ర ఆంటోని ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని శుక్రవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ట్యాబ్ లో ట్రైలర్ ని విడుదల చేసిన పవన్ కల్యాణ్ ట్రైలర్ చూస్తూ నవ్వుల్లో మునిగితేలారు. ఈ మధ్య కాలంలో పవన్ ఓ మూవీ ట్రైలర్ చూస్తూ నవ్వడం ఇదే కావడం విశేషం అని చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇటీవల జ్వరం రావడంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న పవన్ తొలిసారి ఓ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం విశేషం. ఇదిలా వుంటే 'కళాపురం' మూవీ మొత్తం కరీంనగర్ లోని ధర్మపురి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ధర్మపురిలో 42 రోజులు పాటు షూటింగ్ చేశారట. ఈ నెల 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఆత్యంతం ఆస్యభరితంగా సాగే సెటైరికల్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలవబోతోంది.