`ది ఘోస్ట్` ఓటీటీ డీల్ వెనక `వైల్డ్ డాగ్`

Wed Oct 05 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

The Ghost is the wild dog behind the OTT deal

అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన ముందుకెళుతున్నారు. ఇటీవల నాగ్ నటించిన `వైల్డ్ డాగ్` కంటెంట్ బావున్నా ఆశించినంత విజయం సాధించలేదు.కరోనా మహమ్మారీ కూడా ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ప్రస్తుతం నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `ఘోస్ట్` ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. నాగార్జున కొన్ని హై ఆక్టేన్ స్టంట్స్ తో అదరగొట్టాడు.

తాజా సమాచారం మేరకు ఘోస్ట్ అధికారిక OTT స్ట్రీమింగ్ భాగస్వామిని  లాక్ చేసింది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నాగ్ మునుపటి థియేట్రికల్ రిలీజ్ వైల్డ్ డాగ్ తమ వేదికపై చాలా బాగా ఆడిందని నెట్ ఫ్లిక్స్ గతంలో పేర్కొంది.
అందుకే ఇప్పుడు నాగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ ని కైవసం చేసుకుంది. ఘోస్ట్ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో నాగార్జున వెటరన్ స్పెషల్ ఏజెంట్ గా నటించగా.. సోనాల్ చౌహాన్ సహచర అధికారిణిగా నటించింది. ఆర్.ఆర్.ఆర్ - రంగ రంగ వైభవంగా వంటి చిత్రాలను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసింది. ఇప్పుడు ఘోస్ట్ ని కూడా  సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో తెలుగులో పాగా వేసేందుకు నెట్ ఫ్లిక్స్ భారీ పెట్టుబడులను వెదజల్లుతోంది. ఘోస్ట్ ని ఓటీటీ వేదికపై ఆదరిస్తారని నెట్ ఫ్లిక్స్ బలంగా నమ్ముతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.