Begin typing your search above and press return to search.

`ది ఫ్యామిలీ మ్యాన్ 2` టీజ‌ర్.. సామ్ ట్విస్ట్ అదిరెను

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:42 AM GMT
`ది ఫ్యామిలీ మ్యాన్ 2` టీజ‌ర్.. సామ్ ట్విస్ట్ అదిరెను
X
ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్- 1 తెలుగు నాటా విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుని బంప‌ర్ హిట్ సాధించ‌డంతో సీజ‌న్ 2 పై రాజ్ అండ్ డీకే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించారు. రెండో సీజన్ లో అక్కినేని కోడ‌లు స‌మంతను ఓ కీల‌క పాత్రకు ఎంపిక చేయ‌డం ఆసక్తిక‌రం.

`ది ఫ్యామిలీ మ్యాన్ 2`లో సమంత పాత్ర ఆద్యంతం ట్విస్టుల‌తో సాగుతుంద‌ని త‌నో తీవ్ర‌వాది పాత్ర‌లో న‌టిస్తోంద‌ని తొలి నుంచీ ప్ర‌చార‌మైంది. అక్కినేని అభిమానులు త‌న పాత్ర తీరు తెన్నులు ఎలా ఉండ‌నున్నాయో అన్న ఎగ్జ‌యిట్ మెంట్ తో వేచి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆ రోల్ గురించిన ఎలాంటి లీకులు లేవు.

తాజాగా టీజ‌ర్ రిలీజైంది. టీజ‌ర్ లో ఊహించ‌ని ట్విస్ట్ రివీలైంది. సీజన్ 1 ముగింపు నుంచి కొన‌సాగింపును చూపించిన రాజ్ అండ్ డీకే.. మనోజ్ భాజ్‌పేయి లైఫ్ అండ్ ప్రొఫెష‌న‌ల్ గేమ్ ప్లేని ఆవిష్క‌రించారు. అతని వ్యక్తిగత వృత్తిగ‌త జీవితంలో చిక్కుముడుల‌ను రివీల్ చేసారు. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాల‌నుకున్నా కుద‌ర‌ని వృత్తిలో శ్రీ(భాజ్ పాయ్) తన వృత్తిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన ప‌రిస్థితి.

పోలీసులు- ఉగ్రవాదుల మధ్య ఎలుకా పిల్లి ఆట‌లో శ్రీ పాత్ర ఎలా ప‌య‌నిస్తుంది అన్న‌ది తెర‌పై చూడాలి. ఇంతలోనే కొన్ని క్ష‌ణాల నిడివితో సమంత డి-గ్లామర్ రూపం మెరుపులా త‌ళుక్కుమంటుంది.స సుక్కూ రంగస్థలం తరువాత మ‌రోసారి సామ్ డీగ్లామ‌ర్ రోల్ లో న‌టించింది. తాజా వెబ్ సిరీస్ లోనూ అంతే వైవిధ్యం ఉన్న పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే స‌మంత పాత్ర‌లో ర‌క‌ర‌కాల ట్విస్టుల్ని కూడా ఎలివేట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. సీజ‌న్ 2 ట్రైలర్ జనవరి 19న విడుదల కానుంది. ట్రైల‌ర్ లో స‌మంత రోల్ ఎలివేష‌న్ ఎలా ఉండ‌నుందో చూడాలి. ఫిబ్రవరి 12 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.