48 ఏళ్ల సీనియర్ నటి పూల్ సైడ్ ట్రీట్!

Thu Jan 26 2023 14:00:02 GMT+0530 (India Standard Time)

The 48-year-old senior actress' poolside treat

సీనియర్ నటి కస్తూరి పరిచయం అవసరం లేదు. భారతీయుడు లో కమల్ హాసన్ సోదరి పాత్రలో నటించిన కస్తూరి ఇటీవల బుల్లితెర సీరియళ్లతో తెలుగు లోగిళ్లలో బాగా దూసుకెళ్లింది. ఇక సోషల్ మీడియాల్లో నిరంతరం ఫోటోషూట్లను షేర్ చేస్తూ లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన మైలేజ్ ని పెంచుకుంటున్న తారగా కస్తూరి గురించి బోలెడంత చర్చ సాగింది.ఇటీవల నయనతార - విఘ్నేష్ శివన్ కవల మగబిడ్డలకు తల్లిదండ్రులు అవుతున్నారనే వార్త తెలియగానే అలనాటి నటి కస్తూరి శంకర్ సరోగసీ గురించి తన ట్వీట్ తో కలకలం సృష్టించింది. నయనతార పేరును చెప్పకపోయినా కానీ భారతదేశంలో సరోగసీ నిషేధించబడిందని పేర్కొని దుమారం రేపింది.

వృత్తిరీత్యా తాను న్యాయవాదిని అని న్యాయపరమైన కోణంలో ఈ వ్యాఖ్యలు చేసానని పేర్కొంది. అయితే సినిమాల్లో టీవీల్లో ఎక్కువగా తల్లి పాత్రలు పోషిస్తున్న కస్తూరి శంకర్ మాత్రం తీవ్ర ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. నయన్ విషయంలో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని నెటిజన్లు ఆమెను కోరారు. ఆ తర్వాత ఆ వివాదం నెమ్మదిగా సద్ధుమణిగింది.

నిజానికి కస్తూరిని తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేదు. తెలుగు- తమిళం- మలయాళం-కన్నడ చిత్రాలలో నటించిన కస్తూరి శంకర్ టెలివిజన్ వ్యాఖ్యాతగా -యాంకర్ గా రాణించడమే గాక.. బుల్లితెర సీరియళ్లలోను రాణిస్తున్నారు.  ఇటీవల స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి అనే టీవీ షోతో పెద్ద గుర్తింపు పొందింది. షో మంచి రేటింగ్ ను సంపాదించింది.

తన ఇటీవలి ఇంటర్వ్యూలలో జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి కస్తూరి వెల్లడించింది. తన జీవితంలో మూడు సార్లు తన దగ్గరి వారి మరణాన్ని చూసి తీవ్ర విచారంలోకి వెళ్లానని కస్తూరి ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. తన జీవితంలో మూడు సార్లు మరణాన్ని చూశానని భావోద్వేగానికి గురయ్యారు. తల్లితండ్రులు పోవడంతో మొదటి రెండు సార్లు.. ఏడేళ్ల నుంచి లుకేమియాతో బాధపడుతూ మృత్యువుకు చేరువైన కుమార్తెతో మూడోసారి తాను తీవ్ర కలతకు గురయ్యానని కస్తూరి తెలిపారు.

తన కూతురు తన జీవితంలో అత్యంత కష్టతరమైన దశలో పోరాడుతున్నప్పుడు ఆ మూడేళ్లు నరకం చూశానని కస్తూరి చెప్పింది. నిరంతర ఆందోళన- ఒత్తిళ్ల ఫలితంగా ఆ మూడేళ్ల తర్వాత తనకు నిద్రలేమి ఏర్పడిందని చెప్పింది. ఇంటర్వ్యూలో ఉద్వేగానికి లోనైన కస్తూరి.. తను ఉన్న టెన్షన్ గురించి ఎవరికీ చెప్పలేనని తన కూతురు అనారోగ్యంతో ఉన్న ఆ మూడేళ్లలో తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. తన కుమార్తె శోభిని క్యాన్సర్ సర్వైవర్ గా ఉన్న కస్తూరి ఇప్పుడు లుకేమియా బాధిత పిల్లల సంరక్షణ కోసం తన సమయాన్ని వెచ్చిస్తున్నట్లు చెప్పారు.

ఇకపోతే 48 ఏళ్ల వయసులో కస్తూరి తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ లో విన్యాసాలతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇళయరాజా స్వరపరిచిన నాటి మేటి క్లాసిక్ సాంగ్ 'ఒక బృందావనం....' (ఘర్షణ చిత్రంలోనిది) ట్యూన్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా స్విమ్ సూట్ లో కస్తూరి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్లను పెంచుకునేందుకు తన ఎత్తుగడ అని అర్థం చేసుకోవాలి. ఆర్జన కోసం నేటితరంతో పోటీపడుతూ సీనియర్ నటీమణులు ఇలా సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇతరుల బాటలోనే తాను కూడా వెళుతోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.