ఆ సినిమాకు మరో రెండు మూడు ఏళ్ల సమయం పడుతుందట!

Wed Jan 25 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

That movie will take another two or three years!

సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడాడు. సినిమా యొక్క విశేషాలను వెళ్లడించడంతో పాటు విషయాల గురించి సుధీర్ బాబు మీడియా వారితో ముచ్చటించాడు.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పుల్లెల గోపీచంద్ యొక్క బయోపిక్ గురించి స్పందించాడు. ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ మరో రెండు మూడు సంవత్సరాల తర్వాతే ఆ సినిమా ఉంటుంది అన్నట్లుగా పేర్కొన్నాడు.

భారత మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన పుల్లెల గోపీచంద్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఆయన జీవిత చరిత్ర ఎంతో మందికి ఆదర్శం అవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే సుధీర్ బాబు ఆయన బయోపిక్ చేస్తే తప్పకుండా బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆ బయోపిక్ ఉంటుందని ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. తాజాగా సుధీర్ బాబు మరింత సమయం పడుతుందని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు రెండు పార్ట్ లుగా బయోపిక్ ను తీసుకు రావాలా లేదంటే వెబ్ సిరీస్ గా గోపీచంద్ యొక్క బయోపిక్ ను తీసుకు రావాలా అనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సుధీర్ బాబు పేర్కొన్నారు. తన తాజా చిత్రం హంట్ పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా సుధీర్ బాబు తెలియజేశాడు. మరి కొన్ని రోజుల్లో సుధీర్ బాబు హంట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.