Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: మన రైటర్ల కు ముందుంది ముసళ్ల పండగ
By: Tupaki Desk | 28 May 2023 12:31 PMభవిష్యత్ సినిమా ఊహించని ఫేజ్ కి ఎదగబోతోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ప్రయోగాత్మక కంటెంట్ ఉన్న సినిమాల కు ఓ వైపు ఆదరణ పెరుగుతోంది. మరో వైపు భారీ యాక్షన్ కంటెంట్ కి.. హీరోయిజంలో లార్జర్ దేన్ లైఫ్ పాత్రల కు మాస్ ఆడియెన్ పట్టంగడుతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్ సినిమాలకు క్రేజ్ అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. మంచి కథ కథనాల కు అదనంగా భారీ యాక్షన్ .. ఆద్యంతం గగుర్పొడిచే సాహసవిన్యాసా లు ఛేజ్ లతో రక్తి కట్టించే మాసివ్ సినిమాల కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మాస్ జనాన్ని పదే పదే థియేటర్ల కు రప్పించాలంటే కచ్ఛితంగా యాక్షన్ ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని బాహుబలి 2-టైగర్ జిందా హై- పఠాన్ లాంటి భారీ యాక్షన్ సినిమాలు నిరూపించాయి.
స్పై ఆపరేషన్ .. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్.. వార్ ఎపిక్ కంటెంట్ లో యాక్షన్ ని గగుర్పొడిచేలా తెర పై ఆవిష్కరించేందుకు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల ను పరాకాష్ఠలో ఎలివేట్ చేసేందుకు ఆస్కారం ఉండడంతో ఇప్పుడు దర్శకనిర్మాతలు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అలాంటి కథలు ఏం ఉన్నా వెతికి పట్టుకుంటున్నారు. పఠాన్ తర్వాత టైగర్ 3 భారీ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రక్తి కట్టించబోతున్న సినిమాగా ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత హృతిక్ రోషన్ వార్ 2 ఇదే కేటగిరీలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానుంది.
ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ కానుంది. మరో వైపు టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఇరువురు ఖాన్ లను కలిపేందుకు యష్ రాజ్ బ్యానర్ సన్నాహకాల్లో ఉంది. ఇవన్నీ స్పై యాక్షన్ సినిమాలు. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో ఆద్యంతం రక్తి కట్టించబోతున్నాయి. ఈ సినిమాల్లో సూపర్ మేన్ విన్యాసాల కు కొదవేమీ ఉండదు. ఇంతలోనే హృతిక్ కథానాయకుడిగా రాకేష్ రోషన్ క్రిష్ 4 కి సన్నాహాలు చేస్తున్నారు. అదే క్రమంలో ధూమ్ ఫ్రాంఛైజీని రీలోడ్ చేస్తూ అమీర్ ఖాన్ కి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించేందుకు యష్ రాజ్ బ్యానర్ సన్నాహకాల్లో ఉంది.
చూస్తుంటే బాలీవుడ్ లైనప్ అసాధారణంగా కనిపిస్తోంది. ఇతర పోటీదార్ల కు ఏమాత్రం తీసికట్టుగా లేదు. అత్యంత భారీ క్రేజీ సినిమాలు క్యూలో ఉన్నాయి. ఖాన్ లు రోషన్ లు వరుసగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ల తో సవాల్ విసరబోతున్నారు. అయితే ఈ సవాల్ ని స్వీకరించి టాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమలు ధీటైన సమాధానం ఇవ్వడం ఎలా? అంటే.. .దానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాలు రేస్ లో నిలుస్తాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. తొలిగా ఆదిపురుష్ 3డి చిత్రం పఠాన్ - టైగర్ 3 లాంటి భారీ చిత్రాల కు పోటీగా ఆడుతుందని .. ఆ తర్వాత సలార్ తో ప్రభాస్ మరో లెవల్లో రికార్డుల ను సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ తర్వాతా ప్రాజెక్ట్ కే లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రభాస్ పాన్ వరల్డ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.
ఇంతలోనే రామ్ చరణ్ సైతం శంకర్ దర్శకత్వంలోని గేమ్ ఛేంజర్ తో రికార్డులు బ్రేక్ చేయడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నారు. కమల్ హాసన్ భారతీయుడు 2 .. దళపతి విజయ్ -లోకేష్ కనగరాజ్ చిత్రం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు ఇవన్నీ కూడా పాన్ ఇండియా రేసులో సత్తా చాటుతాయనే అంతా నమ్ముతున్నారు. ఇక భారతదేశంలో అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ - రాజమౌళి సినిమా సత్తా చాటుతుందన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.
అయితే ఇలాంటి భారీ లైనప్ తర్వాత కూడా అతి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ల కోసం టాలీవుడ్ స్టార్ రైటర్లు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు? అన్నది కీలకంగా మారనుంది. యాక్షన్ కంటెంట్ టాలీవుడ్ విజయాల్లో అసాధారణ రికార్డుల ను క్రియేట్ చేయడలో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు... మన రచయితలు ఇక పై పూర్తిగా స్క్రీన్ ప్లేని యాక్షన్ పంథాలో పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ధూమ్ - క్రిష్ - పఠాన్ - వార్ ఫ్రాంఛైజీ కథల్ని మించిపోయేలా మన దర్శకరచయితలు కూడా సంపూర్ణ సృజనాత్మకతతో యాక్షన్ సీక్వెన్సులను రాయాల్సి ఉంటుంది.
హీరోయిజాన్ని పరాకాష్టలో చూపిస్తూనే యాక్షన్ ఛేజ్ లతో సినిమా ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లే ను అనుసరించాల్సి ఉంటుంది. సిద్దార్థ్ ఆనంద్.. శంకర్ లాంటి దర్శకుల ను మించి నేటితరం దర్శకరచయితలు సత్తా చాటాల్సి ఉంటుంది. ఎస్.ఎస్.రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ .. శంకర్.. లోకేష్ కనగరాజ్ లాంటి కొద్ది మంది దర్శకులు మాత్రమే సౌత్ నుంచి రేసు లో కనిపిస్తున్నారు. ఈ శాతం మరింత పెరగాలి. నేటితరం టాలీవుడ్ దర్శకుల్లో ను భారీ యాక్షన్ కంటెంట్ ని లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో హైపిచ్ లో ఆవిష్కరించే టెక్నిక్ చాలా అవసరం. ఆ దిశగా ఆలోచిస్తున్నారనే ఆకాంక్షిద్దాం.