వరుస ఫ్లాపుల తరువాత `మజిలీ` హిట్‌తో నాగచైతన్య మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశారు. ఆ తరువాత చేసిన వెంకీ మామ లవ్ స్టోరీ చిత్రాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలవడంతో రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం
`థాంక్యూ`. `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నారు. ఓ విభిన్నమైన కథతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
స్టార్
ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చైకి జోడీగా రాశిఖన్నా
అవికా గోర్ నటిస్తున్నారు. కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్
కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తారని
వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆ మద్య నెట్టింట
వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి
కావచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర విడుదలపై నెట్టింట ఓ రూమర్ వైరల్
గా మారింది. అదేంటంటే ఈ చిత్రాన్ని థియేటర్‌లో కంటే ఓటీటీలో విడుదల
చేయాడానికే నిర్మాత దిల్ రాజు ఆసక్తిని చూపిస్తున్నారని వార్తలు షికారు
చేస్తున్నాయి.
ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో మేకర్స్
సంప్రదింపులు జరిపారని త్వరలోనే `థాంక్యూ` విడుదల తేదీని
ప్రకటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాచారంలో ఎలాంటి
వాస్తవం లేదని చిత్ర బృదం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
``థాంక్యూ` మూవీ ఫైనల్ స్టేజ్‌లో వుంది.
చాలా డెడికేషన్ తో ఈ
చిత్రానికి వర్క్ చేస్తున్నాం. ఇలాంటి చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూస్తే
ఆ అనుభూతి కలుగుతుందని బలంగా నమ్ముతున్నాం. రైట్ టైమ్‌లో ఈ మూవీ
థియేటర్లలోనే విడుదలవుతుంది` అని చిత్ర బృందంక్లారిటీ ఇచ్చేసింది.
దీంతో `థాంక్యూ`ఓటీటీ రిలీజ్ అంటూ జరుగుతున్న ప్రచారానికి తెర పడింది.