చిరంజీవికి 1000 కోట్ల స్టామినా ఉందా..?

Mon Jan 23 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Thammareddy Bhardwaj on commercial stamina of Chiranjeevi

వాల్తేరు వీరయ్య సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ వింటేజ్ చిరు మళ్లీ కనిపించాడని ఖుషి అయ్యారు. అంతేకాదు సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. కానీ కొంతమంది ప్రేక్షకులు మాత్రం వాల్తేరు వీరయ్య గురించి నెగిటివ్ గా మాట్లాడారు. సినిమాలో చిరంజీవి ఏం చేశాడని అంటున్నారు. అయితే అలాంటి వారికి తన మార్క్ ఆన్సర్ ఇచ్చారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. వాల్తేరు వీరయ్య సినిమా మరోసారి చిరంజీవి స్టామినా ఏంటో ప్రూవ్ చేసిందని అన్నారు.అంతేకాదు సినిమాలో కథ లేదని.. చిరంజీవి గురించి నెగిటివ్ గా మాట్లాడే వారికి ఆయన ఫ్యూజులు ఎగిరిపోయే విషయం చెప్పారు. ఈ వయసులో అలా చేయడం కష్టమని అన్నారు.

అంతేకాదు చిరుతో ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న సినిమా మంచి కథతో తీస్తే తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో అది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నారు. చిరంజీవికి ఆ స్టామినా ఉందని.. చిరుకి సరైన సినిమా పడితే రికార్డులు కొల్లగొడతారని అన్నారు తమ్మారెడ్డి భగర్ధ్వాజ.

సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు మంచి రెవిన్యూ తెచ్చాయని. సినిమా పరిశ్రమకు అది మంచి ఉత్సాహం ఇచ్చిందని అన్నారు. చిరంజీవి బాలకృష్ణ ఎవరి స్టామినా వారిది.. ఇద్దరు ఒకేసారి వచ్చి హిట్ కొట్టారని అన్నారు తమ్మారెడ్డి. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది.  

రెండు సినిమాలు విజయం సాధించడంతో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు. ఒకవేళ ఒక సినిమా హిట్టై.. మరో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. మన హీరోల స్టామినా ఇదే అని ఫిక్స్ అవడం కష్టమని సరైన సినిమా పడితే వారు కూడా 1000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తారని తమ్మారెడ్డి అన్నారు.

వీర సింహా రెడ్డితో బాలయ్య గర్జిస్తే.. వాల్తేరు వీరయ్యగా చిరు మెగా స్టామినా మరోసారి ప్రూవ్ చేశారు. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించింది. ఫ్యాన్స్ కొట్లాటలు ఎలా ఉన్నా.. కామన్ ఆడియన్ మాత్రం రెండు సినిమాలను సూపర్ గా ఎంజాయ్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.