Begin typing your search above and press return to search.

జగదీష్‌ కు మొదలు పెట్టిన థమన్‌

By:  Tupaki Desk   |   23 Jan 2020 9:41 AM GMT
జగదీష్‌ కు మొదలు పెట్టిన థమన్‌
X
అల వైకుంఠపురంలో చిత్రం సూపర్‌ హిట్‌ క్రెడిట్‌ ను థమన్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే. సక్సెస్‌ వేడుకలో అల్లు అర్జున్‌ మరియు త్రివిక్రమ్‌ లు ఈ చిత్రం సక్సెస్‌ కు ప్రధాన కారణం సంగీతం. దాన్ని అందించిన థమన్‌ కు ఈ సక్సెస్‌ క్రెడిట్‌ దక్కుతుంది అంటూ ప్రేక్షకుల ముందు బాహాటంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అంతటి ప్రశంసలు దక్కించుకున్న తర్వాత థమన్‌ తన పనిలో మరింత రెచ్చి పోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌.. మోస్ట్‌ క్రేజీ సంగీత దర్శకుడు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు థమన్‌. అందుకే చిన్నా పెద్ద హీరోలు అంతా కూడా ఆయన వెంట పడుతున్నారు. ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి మరీ తమ సినిమాలకు సంగీతం చేయించుకునేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో నాని 'టక్‌ జగదీష్‌' చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రం ప్రకటించి చాలా రోజులు అయ్యింది.

ఇన్నాళ్లు ఇతర సినిమాలతో బిజీగా గడిపిన థమన్‌ ప్రస్తుతం టక్‌ జగదీష్‌ చిత్రం కోసం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నట్లు గా చెప్పుకొచ్చాడు. నాని తో థమన్‌ మొదటి సారి వర్క్‌ చేయబోతున్నాడు. శివ నిర్వాన దర్శకత్వంలో షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ లో ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది. మా కొత్త మ్యూజికల్‌ జర్నీ ప్రారంభం అయ్యింది. కొత్త వారితో సాగుతున్న ఈ ప్రయాణం బాగుందంటూ లవ్‌ యూ నాని అంటూ ఒక లవ్లీ ఆల్బం ఇస్తానంటూ నానికి హామీ ఇచ్చాడు.