Begin typing your search above and press return to search.

థ‌మ‌న్ ని వెన్నుపోటు పొడిచిందెవ‌రు?

By:  Tupaki Desk   |   13 Feb 2022 5:14 AM GMT
థ‌మ‌న్ ని వెన్నుపోటు పొడిచిందెవ‌రు?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట‌`కి సంబంధించి ఓ వీడియో సాంగ్ లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో యూనిట్ ఒక్క‌సారిగా షాక్ తింది. ఎంతో క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించిన సాంగ్ ఏకంగా వీడియోతో పాటే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. స‌రిగ్గా లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేద్దామ‌ని ప్లాన్ చేసుకుంటోన్న స‌మ‌యంలో యూనిట్ కి ఇలా షాక్ త‌గిలింది.

తాజాగా ఈ విష‌యంపై చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ట్విట‌ర్ వేదిక‌గా ఎమోష‌నల్ అయ్యారు. ఆరు నెల‌లు పాటు పాట‌ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. క‌రోనాని సైతం లెక్క‌చేకయ‌కుండా ధైర్యంగా ముందుకెళ్లాం.

అప్ప‌ట్లో మాటీమ్ లో 8 మందికి కరోనా కూడా సోకింది. ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి ప‌నిచేసాం. పాట కోసం వేయి మంది ప‌నిచేసారు. హీరోపై ఉన్న ప్రేమ‌ను అంతా ఈపాట‌లో చూపించాను. నిర్మాత‌లు ఎంతో ఖ‌ర్చు చేసారు. పాట కోసం వ‌ర‌ల్డ్ బెస్ట్ టెక్నాల‌జీ కూడా వాడాం. హై స్టాంట‌ర్స‌డ్ ఉన్న సాంగ్ ఇది. అలాంటి పాట‌ని ఎవ‌డో చాలా ఈజీగా లీక్ చేసాడు.

వాడికి ప‌ని క‌ల్పిస్తే మాకు ఈ పని చేసిపెట్టాడు. గుండె త‌ర‌క్కుపోతుంది. కోపంగా ఉండాలా..బాధ‌ప‌డాలో అర్దం కాలేదు. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్. గ‌తంలో ఇలాంటివి చాలా చూసాను. కానీ నేను ఎందుకు ప‌బ్లిక్ డొమైన్ లో ఆడియో పెడుతున్నానో వాడికి అర్ధం కావాలి. మ‌ళ్లీ భ‌విష్య‌త్ లో ఇలాంటివి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌ ప‌డ‌తాం. అభిమానులంతా క్ష‌మించాల‌ని కోరుకుంటున్నా` అని థ‌మ‌న్ అన్నారు.

లీకులు స‌హ‌జ‌మే. చిన్న చిన్న‌ స‌న్నివేశాలు..సాంగ్ బిట్స్ ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర నుంచి ఎక్కువ‌గా లీక్ అవుతుంటాయి. కానీ `స‌ర్కారు వారి పాట‌`కి సంబంధించి ఏకంగా అన్ని ప‌నులు పూర్తిచేసిన త‌ర్వాత సినిమాలో చూడాల్సిన పాట‌ని ఏకంగా రిలీజ్ కి ముందే ప‌బ్లిక్ లోకి తీసుకొచ్చేయ‌డం అన్న‌ది హేయ‌మైన చ‌ర్య‌.

మ‌రి ఈ ప‌ని చేసింది? ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది? వంటి వివ‌రాలు థ‌మ‌న్ రివీల్ చేయ‌లేదు. బాగా తెలిసిన వ్య‌క్తే వెన్ను పోటు పొడిచిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌హేష్ కి జంట‌గా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్- 14 రీల్స్- జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.