Begin typing your search above and press return to search.

SSMB 28: రూమర్స్ కు చెక్ పెట్టిన థమన్

By:  Tupaki Desk   |   1 April 2023 3:30 PM GMT
SSMB 28: రూమర్స్ కు చెక్ పెట్టిన థమన్
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదిలోనే స్టార్ అయింది.

అయితే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కానీ చాలా రోజులుగా థమన్ ఇస్తున్న ట్యూన్స్ దర్శక, నిర్మాతలను మెప్పించలేదని.. అందుకే ఆయనను ఈ సినిమా నుంచి తీసేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

దీనిపై ఇప్పటి వరకు అటు చిత్రబృందం కానీ ఇటు థమన్ కానీ స్పందించలేదు. కానీ ఆయన తాజాగా చేసిన ట్వీట్ చూస్తుంటే మాత్రం.. ఆయన ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

మే 31వ తేదీ నాడు అంటూ ఎస్ఎస్ఎంబీ 28 కు సంబంధించిన ఓ పోస్టర్ ను షేర్ చేశాడు. అయితే ఆరోజు ఏదో ఒక సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు అర్థం అవుతుంది. మరి చూడాలి ఛమన్ న్యూ సాంగ్ ఎంటో, ఎలా ఉంటుందో. అయితే థమన్ అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మరోవైపు ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్, ఇతర పనులను చకచకా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదండోయ్ ఈ చిత్రం మూవీ రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకముందే ఓటీటీ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.