థమన్ ఐటం బీట్ సమ్ థింగ్ మిస్సింగ్!

Mon Jan 17 2022 23:00:01 GMT+0530 (IST)

Thaman Kodthe Song In Ghani Movie

సంగీత దర్శకుడు థమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో థమన్ ట్రెండ్ కొనసాగుతోంది. మాస్..క్లాస్ ఎలాంటి పాటలతోనైనా శ్రోతల్ని ఆకట్టుకోవడం థమన్ ప్రత్యేకత. థమన్ లో ఆ ప్రతిభనే అంతటి వాడిని చేసింది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాలన్నింటికీ తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ఇక ఐటం పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయడంలో థమన్ స్పెషాల్టీ..మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. కానీ  `గని` సినిమాలో అదెక్కడో మిస్ అయినట్లు అనిపిస్తోంది. మెగా ప్రివన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా గని చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని `కోడ్తే` అనే లిరికల్ సింగిల్ ని రిలీజ్ చేసారు. ఇందులో తమన్నా నర్తించింది. అయితే ఈ పాట మాస్ కి కనెక్ట్ అవ్వడం అంత సులభం కాదు. ట్యూన్స్ సహా సాహిత్యం మాస్  యాంగిల్ మిస్ అయిందన్న విమర్శ వినిపిస్తోంది. పాట వినడానికి వినసొంపుగా అనిపిస్తుంది తప్ప! ఐటమ్ పాట అనే ఫీల్ ఎక్కడా తీసుకురావడం లేదు. థమన్ మాస్ ట్యూన్స్ కి పూర్తి భిన్నంగా ఉంది. అయితే థమన్ కొత్తగా ట్రై చేసినట్లు అనిపిస్తుంది. మరి దీన్ని  ఐటం పాట అనాలా?  లేక సిచ్వేషనల్ సాంగ్ లో భాగంగా తమన్నాతో స్టెప్పులు వేయించారా? అన్నది రిలీజ్ వరకూ క్లారిటీ  లేదు.

ఇది బాక్సింగ్ నేపథ్యంతో కూడిన  సినిమా. పాటలో వరుణ్ తేజ్ కండలు తిరిగిన బాడీని హైలైట్ చేసారు. అలాగే బాక్సింగ్ రింగ్..అందులో వరుణ్  పంచ్ లు హైలైట్.  ఇందులో జగపతిబాబు..సునీల్ శెట్టి..నవీన్ చంద్ర..సాయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు బాబి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. రినైసెన్స్  అనే పిక్చర్స్ పై బాబి నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.