Begin typing your search above and press return to search.

త‌లైవి న‌ష్టాలు.. స‌ద్ధుమ‌ణ‌గ‌ని బ‌యోపిక్ వివాదం

By:  Tupaki Desk   |   22 March 2023 11:00 PM GMT
త‌లైవి న‌ష్టాలు.. స‌ద్ధుమ‌ణ‌గ‌ని బ‌యోపిక్ వివాదం
X
ఎన్టీఆర్-క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్- మ‌హానాయ‌కుడు చిత్రాల‌కు స‌హ‌నిర్మాత‌గా ఉన్న విష్ణు ఇందూరి ఆ త‌ర్వాత కూడా వ‌రుస‌గా బ‌యోపిక్ ల‌ను నిర్మించిన‌ సంగ‌తి తెలిసిందే.1983 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో మాజీ టీమిండియా కెప్టెన్.. స్టార్ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83లో పెట్టుబ‌డులు పెట్టారు.

ఆ త‌ర్వాత మేటి క‌థానాయిక మ‌హా నాయ‌కురాలు జె.జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ని త‌లైవి పేరుతో నిర్మించారు. కానీ ఇవేవీ ఆశించిన ఫ‌లితాల‌ను ఇవ్వ‌ని సంగ‌తి తెలిసిందే.

కంగ‌న న‌టించిన త‌లైవి పంపిణీదారుల‌కు తీవ్ర న‌ష్టాల‌ను మిగిల్చింద‌ని క‌థ‌నాలొచ్చాయి. తాజా స‌మాచారం మేర‌కు త‌లైవి (2021) పంపిణీ వ‌ర్గాలు నిర్మాత‌ల‌ నుండి 6 కోట్ల రూపాయల వాపసును క్లెయిమ్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ న‌ట‌న‌కు విమర్శకుల ప్రశంసలు ద‌క్కినా కానీ బాక్సాఫీస్ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది.

దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. పంపిణీ సంస్థ 'జీ' ఆ చిత్ర నిర్మాతల నుంచి రూ.6 కోట్లు వాపసు కోరినట్లు సమాచారం. జీ సంస్థ‌ పంపిణీ హక్కుల కోసం 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించినా అది ఇప్ప‌టివ‌ర‌కూ తిరిగి పొందలేదు.

పంపిణీ సంస్థ అభ్యర్థిస్తూ ఇమెయిల్ లు .. లేఖలను పంపినా కానీ నిర్మాత‌ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినందున చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... 35 ఏళ్ల కంగ‌న‌ చివరిసారిగా 'ధాకడ్‌'లో కనిపించింది. ఈ భారీ యాక్ష‌న్ చిత్రం డిజాస్ట‌ర‌వ్వ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. తదుపరి 'ఎమర్జెన్సీ'లో క్వీన్ ఇందిరాగాంధీ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం తన రెండవ తమిళ ప్రాజెక్ట్ 'చంద్రముఖి 2' షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంద‌ని స‌మాచారం.            


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.