Begin typing your search above and press return to search.

44 ఏళ్ల వ‌య‌సులో మార్ష‌ల్ ఆర్స్ట్ సాధ్య‌మేనా సిద్దార్ధ్?

By:  Tupaki Desk   |   30 May 2023 11:32 AM GMT
44 ఏళ్ల వ‌య‌సులో మార్ష‌ల్ ఆర్స్ట్ సాధ్య‌మేనా సిద్దార్ధ్?
X
మార్ష‌ల్ ఆర్స్ట్ ట్రైనింగ్ అన్న‌ది చిన్న వ‌య‌సు నుంచే అల‌వాటు చేసుకోవాలి. ఆ య‌వ‌సులో కాళ్లు.. చేతులు..వాటి తాలుకా కీళ్లు లేతగా ఉండ‌టంతో అనుగుణంగా వంగ‌డానికి వీలు ఉంటుంది. అది ఎంతో క‌ఠోరమైన శిక్ష‌ణ‌. మ‌న‌సు ల‌గ్నంతో పాటు..మ‌నిషి ఎంతో దృష్టి సారిస్తే త‌ప్ప‌! సాధ్యం కాని విద్య అది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరో కూడా మార్ష‌ల్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకున్న‌వారే. చిన్న వ‌య‌సులోనే ప‌వ‌న్ కి ఈ విద్య‌పై ఆస‌క్తి ఉండ‌టంతో! ప్ర‌త్యేకంగా ట్రైనింగ్ తీసుకుని అందులో టెక్నిక్ లు నేర్చుకున్నాడు.

ఇది పూర్తిగా సెల్ప్ డిఫెన్స్ కి ఎంత‌గానో ఉప‌యోగ ప‌డే విద్య‌గా భావిస్తారు. అయితే 44 ఏళ్ల వ‌య‌సులో న‌టుడు సిద్దార్ధ్ కూడా మార్ష‌ల్ ఆర్స్ట్ లో ట్రైనింగ్ తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా 'ట‌క్క‌ర్' అనే సినిమా తెర‌కెక్కుతోంది.

కార్తీక్ జి. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు..త‌మిళ్ లో ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా సిద్దార్ధ్ మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకున్న‌ట్లు తెలిపాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌ని ల‌వ‌ర్ బోయ్ గా..చాక్లెట్ బోయ్ గానే తెర‌పై చూసారని..తొలిసారి యాక్ష‌న్ హీరోగా చూస్తార‌ని..ఈ సినిమా ఒక డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్ అన్నారు. 'ఇప్ప‌టికే ఓ ప్ర‌త్యేక‌మైన జోన‌ర్ సినిమాలే చేసాను.

ఒక పాత్ర ఇస్తే ఆరంభం నుంచి చివ‌రి దాకా సిద్దార్ధ్ లా కాకుండా ఒక పాత్ర‌లాగే క‌నిపించేలా న‌టించా. ఈక్ర‌మంలో నువ్వు ఎందుకు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేయ‌డం లేద‌ని అడిగారు. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ట‌క్క‌ర్ ఇస్తుంది.

తొలిసారి మార్స‌ల్ ఆర్స్ట్ నేర్చుకున్నా. అందుకోసం ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నా. కండ‌లు పెంచాను. భారీ పోరాట స‌న్నివేశాల్లో న‌టించాను. కొత్త త‌రానికి న‌చ్చేలా ఓ మంచి ప్రేమ క‌థ కూడా ఉంది.

మొత్తంగా సినిమాలో కొత్త సిద్దార్ధ్ ని చూస్తారని ధీమా వ్య‌క్తం చేసారు. అయితే సిద్దార్ధ్ మార్ష‌ల్ ఆర్స్ట్ నేర్చుకోవ‌డం వెనుక నెటి జ‌నులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. 44 ఏళ్ల వ‌యసులో ఈ విద్య ఎలా సాధ్య‌మంటూ కామెంట్లు పోస్ట్ చేస్తారు.