కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా వెల్లడించేందుకు కథానాయికలు ఇతర సహాయ నటీమణులు ధైర్యం చేస్తున్న ఈ సందర్భంలో పరిశ్రమలోని పురుష పుంగవులు తమకు జరిగిన అన్యాయాలపై గొంతెత్తేందుకు సిద్ధమవ్వడం సంచలనంగా మారింది. ఇటీవలే తనను కాఫీకి రమ్మని ఒక పేరున్న మగువ సమయం కాని సమయంలో పిలిచిందంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆరోపించారు. ఇంతలోనే థాక్రే ల కుటుంబీకుడు.. నటుడు ఒకరు అదే తరహాలో తనని ఆడిషన్స్ కోసం మసాజ్ సెంటర్ కి రమ్మని పిలిచారని ఆరోపించడం హీటెక్కిస్తోంది. ఇంతకీ ఎవరాయన? అంటే... పేరు శివ్ థాక్రే. మహారాష్ట్రకు చెందిన అప్ కం నటుడు.
శివ్ థాక్రే బిగ్ బాస్ 16తో బాగా సుపరిచితుడు. ఇటీవల పాపులర్ ఫేస్ గా మారాడు. రియాలిటీ షో కంటెస్టెంట్ నటుడిగా కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇటీవలే తన మొదటి సరికొత్త కారు టాటా హారియర్ ను రూ. 30 లక్షలతో కొనుగోలు చేశారు. అలాగే అతడు తన కొత్త రెస్టారెంట్ ను కూడా ప్రారంభించాడు. తాజా ఇంటర్వ్యూలో శివ థాక్రే తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎలా కష్టపడ్డాడో వెల్లడించాడు. కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని కూడా బయటపెట్టాడు. మహారాష్ట్ర- అమరావతికి చెందిన శివ్ థాక్రే 2015 నుంచి ముంబైలో ఆడిషన్స్ లో పాల్గొంటూనే ఉన్నారు.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో శివ్ థాక్రే కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఓపెనయ్యాడు. నేను ఒకసారి ఆరామ్ నగర్ లో ఆడిషన్ కోసం వెళ్ళాను. అతడు నన్ను బాత్రూమ్కి తీసుకెళ్లి ''యహ పే మసాజ్ సెంటర్ హై'' అని చెప్పాడు. నాకు ఆడిషన్ కి మసాజ్ సెంటర్ మధ్య సంబంధం ఏమిటో అర్థం కాలేదు. అప్పుడతను నాకు ఏమని చెప్పాడంటే...ఏక్ బార్ ఆప్ ఆవో యహా ఆడిషన్ కే బాద్.
ఆప్ వర్కవుట్ భీ కర్తే హో...! అని అన్నాడు. అతను కాస్టింగ్ డైరెక్టర్ కావడంతో నేను గొడవ పెట్టుకోవడం మంచిది కాదని నేను అక్కడి నుండి వెళ్లిపోయాను. నేనేమీ సల్మాన్ ఖాన్ ని కాదు. ఎదురు తిరగలేను. కానీ నేను ఈ (కాస్టింగ్ కౌచ్) విషయంలో స్త్రీపురుషుల మధ్య ఎలాంటి వివక్ష లేదని గ్రహించాను! సైలెంట్ గా అక్కడినుంచి వెళ్లిపోయాను! అని అన్నాడు.
33 ఏళ్ల నటుడు శివ్ ఠాక్రే తనకు ఎదురైన మరో ఎపిసోడ్ ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ''నాలుగు బంగ్లాలలో ఒక మేడమ్ ఉండేది. ఆమె నాకు 'మైనే ఇస్కో బనాయా హై- మైనే ఉస్కో బనాయా హై! అని చెప్పేది. ఆమె నన్ను 11 పీఎం ఆడిషన్ కోసం పిలుస్తుంది. రాత్రి వేళ.. ఇత్నా భోలా తో నహీ హూన్ మైన్ కి... రాత్రి వేళలో ఏ ఆడిషన్స్ జరుగుతాయో నాకు అర్థం కాలేదు కాబట్టి.. నాకు కొంత పని ఉందని కలవలేనని చెప్పాను. దానికి ఆమె ''కామ్ నహీ కర్ణా?'' నీకు ఇండస్ట్రీలో పని ఇవ్వరు!'' అని హెచ్చరించిందని తెలిపారు.
కాబట్టి ఇక్కడ ఇతరులు మనల్ని డీవియేట్ చేస్తారు. తారలను మానిప్యులేట్ చేస్తారు. కానీ నేను దాని గురించి ఎప్పటికీ బాధపడను! అని అన్నారు. శివ్ థాక్రే బిగ్ బాస్ తర్వాత పలు చిన్న సినిమాల్లో నటించారు. ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి 'ఖత్రోన్ కే ఖిలాడి' తదుపరి సీజన్ లో శివ థాక్రే కనిపించవచ్చని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.