Begin typing your search above and press return to search.

గంగవ్వను ఒంటరిని చేశారా.. ఫ్యాన్స్​లో టెన్షన్​

By:  Tupaki Desk   |   16 Sep 2020 8:30 AM GMT
గంగవ్వను ఒంటరిని చేశారా..  ఫ్యాన్స్​లో టెన్షన్​
X
భారీ అంచనాలతో మొదలైన బిగ్​బాస్​ హౌస్​ ప్రస్తుతం డీలా పడిపోయింది. వినోదం లేక ప్రేక్షకులకు రోజురోజుకూ ఆసక్తి తగ్గిపోయింది. అయితే హౌస్​లోకి అడుగుపెట్టిన గంగవ్వ మాత్రం ఈ షోకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. సోషల్​మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్​ ఉంది. ఇప్పటివరకు మేము బిగ్​బాస్​ షో చూడలేదు కానీ.. ఇప్పడు గంగవ్వకు ఓట్లేస్తాం అంటూ సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఆమె రేంజ్​ తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన బిగ్​బాస్​ ఇంటి సభ్యులు ఆమెను టార్గెట్​ చేశారేమోనని ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. దీంతో గంగవ్వ హౌస్​లో ఉండలేకపోతోంది. పైకి అందరూ గంగవ్వతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆమెను పరోక్షంగా టార్గెట్​ చేసినట్టు అర్థమవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. గంగవ్వను ఎలాగైనా బయటకు పంపించాలని కొందరు సభ్యులు ఆలోచిస్తున్నారట. ఆమెకు బయట ఫుల్​ ఫాలోయింగ్ ​ఉంది కాబట్టి ఎన్నిసార్లు నామినేట్​ చేసినా సేవ్​ అవుతోంది.. కాబట్టి హౌస్​లో ఒంటరిని చేస్తే గతంలో సంపూర్ణేష్​బాబు పోయినట్టు ఆమె వెళ్లిపోతుందని కొందరు కుట్రలు చేశారట.

ఆమె ఆటిడ్యూడే ఫిదా చేసింది
కల్లాకపటం లేని నిర్మల మనసుతో మై విలేజ్ షోతో అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వకు బిగ్​బాస్​ హౌస్​కు వెళ్లాక కూడా ఆదరణ తగ్గలేదు. మిగతా సభ్యుల్లాగా నటించకుండా షోలో ఆమె చాలా సహజంగా ఉండటం కూడా ఎంతోమందికి నచ్చింది. అయితే గంగవ్వ మాత్రం అక్కడ కుదురుకోలేకపోతోంది. అందుకే ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రతీ సారి తనే ముందుడుగు వేస్తోంది. దీంతో ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. నా వల్ల కాదు బిడ్డ, నేను పోతా.. అంటూ పలుమార్లు తన ఆలోచనను బయటపెడుతోంది. గతంలో సంపూర్ణేష్ బాబు కూడా ఇలాగే ప్రవర్తించాడు. బిగ్​బాస్​తో గొడవపెట్టుకొని మరి ఇంట్లోనుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం గంగవ్వ కూడా అలాగే వస్తుందేమో వేచి చూడాలి.

గంగవ్వపోతే.. బిగ్​బాస్​ చూసేవాళ్లే ఉండరా!
మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయంటే ఆమెకు ఏరేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్​ ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి బిగ్​బాస్​ వంటి షోలపై ఆసక్తి ఉండదు. ప్రస్తుతం గంగవ్వ ఉండటం వల్ల పల్లెటూర్లలో ఈ షోను చాలామంది చూస్తున్నారు. కానీ గంగవ్వ వెళ్లిపోతే బిగ్​బాస్​కు టీఆర్​పీ పడిపోవడం ఖాయం. అందుకే బిగ్ బాస్ ఇప్పట్లో ఆమెను పంపేలా లేడని సమాచారం. అయితే గంగవ్వ షో చివరివరకు ఉండదని మరొక టాక్ వస్తోంది. గంగవ్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.