టెన్నిస్ ప్లేయర్ లియాండర్ లైఫ్లోకి ఎంత మంది అమ్మాయిలో వచ్చి వెళ్లారో తెలుసా..?

Mon Dec 06 2021 07:00:01 GMT+0530 (IST)

Tennis Player Leander Paes Life Story

ఒకమ్మాయితో ప్రేమాయణం... కొద్దికాలానికే మరో అమ్మాయితో సహజీవనం.. చివరికి వీరే అమ్మాయితో బీచుల్లో కేరింతలు.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. కానీ రియల్ లైఫ్లో మాత్రం ఇలా ఏ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉండకుండా బ్రేకప్ చెప్పేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ సందర్భంగా ఆమె మొదటి గార్ల్ ఫ్రెండ్ మహిమా చౌదరి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. 'లియాండర్ ఫేమస్ ప్లేయర్ కావచ్చు.. కానీ నాకు మాత్రం  ఫెయిర్ వ్యక్తి కాదు' అని సంచలన విషయాన్ని చెప్పింది. ఇంతకీ ఫేస్ లైప్లో ఇంతమంది అమ్మాయిలతో ఎందుకు గడపాల్సి వచ్చింది..? వారు ఏమంటున్నారు..?క్రీడా రంగానికి సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంటుంది. ప్లేయర్లు నటులతో.. నటులు ప్లేయర్లు ప్రేమాయణం చేసి పెళ్లి చేసుకున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. వీరిలాగే టెన్నిస్ ప్లేయర్ లియాండర్ ఫేస్ సినీ నటి మహిమా చౌదరి ప్రేమలో పడ్డారు. కామన్ స్నేహితుల ద్వారా వీళ్లు ఓ పార్టీలో కలుసుకున్నారు. తొలిచూపులోనే మహిమతో ప్రేమలో పడ్డాడు ఫేస్. దీంతో అతని ఆట చూసి మహి కూడా ముచ్చటపడిపోయింది. ఈ ఇద్దరు మంచి పోజిషన్లో ఉండగానే కలుసుకున్నారు. అయితే లియాండర్ కోసం మహి తన కెరీర్ ను పక్కనబెట్టింది. అతని వెంటే ఆటను చూడ్డానికి వెళ్లేది. ఎక్కడికి వెళితే అక్కడికి తన వెంటే ఉండేది. అలా మూడేళ్లు  గడిచాయి.

ఆ తరువాత లియాండ్ మనసులో మరో అమ్మాయి వైపు చూడాలన్న కోరిక పుట్టింది. ఇదే సమయంలో అతనికి పరిచయం అయింది రియా పిళ్లై. ఓ కార్యక్రమంలో రియాను చూసిన ఫేస్ తన మనసును అమెకు ఇచ్చేశాడు. అయితే రియా అప్పటికే సంజయ్ దత్ తో తెగదెంపులు చేసుకొని ఖాళీగా ఉంది. దీంతో లియాండర్ అమెతో అసలు విషయాన్ని చెప్పగా  సహజీవనం చేసేందుకు రెడీ అయింది. దీంతో ఫోన్లో బయట కలుసుకోవడం మొదలైంది. ఇలా రియాతో కలుసుకోవడం మొదలు పెట్టిన తరువాత మహిమకు దూరమవుతూ వచ్చాడు.

అయితే ఫేస్ పై మహిమకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఒక సందర్భంలో తనతో ఎక్కువగా కలిసుండడం లేదని అనగా..'తీరికలేకుండా మ్యాచులు ఉన్నాయి..ఎండార్స్ మెంట్ తో బిజీగా ఉన్నా' అని సమాధానం ఇచ్చాడు. ఒకసారి రియాతో ఫేస్ మాట్లాడుతుండగా మహిమా చూసింది. దీంతో లియాండర్ ను నిలదీసింది. అయితే 'అలాంటిదేమీ లేదు' అని తప్పించుకున్నాడు. అయితే అతనిపై సందేహం పూర్తిగా తొలిగిపోలేదు. దీంతో వారిపై నిఘా వేయసాగింది. ఒకసారి చనువుగా ఉండగా వారిని పట్టుకుంది. అప్పుడు నిలదీయగా 'ఇప్పుడు ఏం సమాధానం చెబుతావ్..' అని ఫేస్ ను నిలదీసింది. దీంతో లియాండర్ అసలు విషయం చెప్పేశాడు.

అక్కడితో ఫేస్ జీవితం నుంచి తప్పుకుంది మహిమా. అయితే లియాండర్ మాత్రం రియాతో సహజీవనం కొనసాగించాడు. ఆ తరువాత వీరిద్దరు ముంబైలోని కొలాబాలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీరికి ఓ కూతురు పుట్టింది. ఆమె పేరు రియానా. అయితే వీళ్ల కాపురం కూడా ఎన్నాళ్లో సాగలేదు. 2014లో లియాండర్అ తని తండ్రి మీద రియా గృహ హింస కేసు పెట్టింది. ఆ తరువాత కూతురి కస్టడి కోసం కేసు కూడా ఫైల్ చేయించింది. అయితే వీరి మధ్య ఎందుకు వివాదం ఏర్పడిందనేదిమాత్రం బయటికి రాలేదు.

అయితే లియాండర్ మరో క్రీడాకారిని తన్వీ ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. కానీ తన్వీ మాత్రం ప్రకకటించలేదు. కానీ ఫేస్  తాజాగా కిమ్ శర్మతో గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మహిమా 'తనను మోసం చేసినట్లే రియాను మోసం చేశాడని అంది.. అంతేకాకుండా లియాండర్ గొప్ప టెన్నిస్ ప్లేయర్ కావచ్చు.. కానీ నాతో మాత్రం ఫెయిర్ గా లేడు.. అతనితో విడిపోవడం ఒక రకంగా మంచే జరిగింది' అని తెలిపింది. ఇక మహిమా బాబీ ముఖర్జీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా కలిసుండలేకపోయింది. అయితే వారికి ఓ కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటోంది.