Begin typing your search above and press return to search.

ఆహా అదుర్స్..!

By:  Tupaki Desk   |   1 March 2021 6:55 AM GMT
ఆహా అదుర్స్..!
X
కరోనా లాక్ డౌన్ సమయంలో 100 శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది ప్రాంతీయ యాప్ ''ఆహా''. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ - మై హోమ్ గ్రూప్ రామ్ సారధ్యంలోని ఈ ఓటీటీకి అనతికాలంలోనే మంచి ఆదరణ లభించింది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వీడియోల‌కు ధీటుగా ఎదుగుతోంది. అచ్చమైన తెలుగు ఓటీటీగా ఓన్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవ‌డంతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా 'ఆహా'కు డౌన్ లోడ్స్ జ‌రుగుతున్నాయని తెలుస్తోంది. అలానే 'ఆహా' యాప్ లో అప్లోడ్ చేస్తున్న కంటెంట్ కూడా చాలా సెన్సిబుల్ గా ఉండ‌టంతో దీనికి లేడీ ఫ్యాన్స్ ఫాయిలోయింగ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో విజయవంతంగా ఒక ఏడాది కాలం పూర్తి చేసుకుని ఓవర్ ది టాప్ అనిపించుకుంది 'ఆహా'.

'ఆహా' లో తెలుగు సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేయడంతో పాటుగా మలయాళ సూపర్ హిట్ సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. సమంత అక్కినేని హోస్టుగా 'సామ్‌ జామ్‌' టాక్‌ షో - త‌మ‌న్నాతో ఒరిజ‌న‌ల్ పిక్చ‌ర్స్ వంటి వాటితో పాటుగా 'మెయిల్' 'కమిట్ మెంటల్' వంటి వెబ్ సిరీస్ లతో వీక్షకులను అట్రాక్ట్ చేశారు. 'రోజుకి రూపాయ్ మాత్ర‌మే క‌ట్టండి' అనే మార్కెటింగ్ స్ట్రాట‌జీ త‌దితర అంశాలు 'ఆహా' బ్రాండ్ ని మ‌రింత పెంచాయ‌ని చెప్పవచ్చు. ఓ సూప‌ర్ స్టార్ హీరో సినిమా రైట్స్ ఏదైనా ద‌క్కించుకుంటే మాత్రం 'ఆహా' నెక్ట్స్ లెవ‌ల్ కి వెళ్ల‌డ‌మే కాకుండా.. తెలుగు కంటెంట్ విషయంలో నెంబ‌ర్ వన్ అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.