Begin typing your search above and press return to search.

థమన్‌ కు బన్నీ 'బ్లాస్టింగ్' పంచ్

By:  Tupaki Desk   |   29 May 2023 10:59 AM GMT
థమన్‌ కు బన్నీ బ్లాస్టింగ్ పంచ్
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతూ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోన్నాడు సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్. ఏకకాలంలో పదుల సంఖ్యలో మూవీలను చేస్తోన్న అతడు.. చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ ప్రాజెక్టుల వరకూ దేన్నీ వదిలి పెట్టడం లేదు. దీంతో అతడు అస్సలు తీరిక లేకుండా బిజీగా గడుపుతోన్నాడు.

ఒకపక్క వరుసగా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్న అతడు.. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోన్న 'తెలుగు ఇండియన్ ఐడల్' అనే సింగింగ్ షోకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో థమన్ తనదైన జడ్జ్‌మెంట్‌, పంచ్‌లు, ప్రాసలు, సెటైర్లతో అక్కడున్న సింగర్లను, తోటి న్యాయ నిర్ణేతలను షాకయ్యేలా చేస్తోన్నాడు.

'తెలుగు ఇండియన్ ఐడల్' రెండో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా వచ్చాడు. 'పుష్ప' మూవీలోని ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటతో అతడు అదిరిపోయే ఎంట్రీని ఇచ్చాడు. ఆ తర్వాత కూడా తనదైన శైలిలో అందరినీ అలరించాడు. ఇక, ఇందులో కంటెస్టెంట్లు అందరూ బన్నీ పాటలే ఆలపించగా.. వాళ్లకు అతడు కొన్ని గిఫ్టులు కూడా ఇచ్చాడు.

'తెలుగు ఇండియన్ ఐడల్' ఫినాలే ఎపిసోడ్‌లో భాగంగా థమన్ 'రేసుగుర్రం' సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశాడు. దీని తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'నువ్వు నా పుష్ప సినిమాకు ఎలాగో మ్యూజిక్ చేయడం లేదు కాబట్టి.. కనీసం కొరియోగ్రాఫర్‌గా అయినా చెయ్' అని సరదాగా అన్నాడు. దీంతో థమన్ 'త్వరలోనే నీతో మరోసారి పని చేస్తాను బ్రదర్' అని అన్నాడు.

అక్కడితో ఆగని థమన్ 'నీ సినిమాలకు వర్క్ చేస్తోన్న సమయంలోనే కొన్ని కీబోర్డులు కూడా విరిగిపోయాయి' అని అన్నాడు. దీంతో బన్నీ ఏమాత్రం తడబడకుండా 'వేరే సినిమాలకు డ్రమ్ములు చిరగ్గొడుతున్నావంట' అంటూ పంచ్ వేశాడు.

దీంతో థమన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాస్తవానికి అతడే నిజంగానే 'అఖండ', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలకు డ్రమ్ములు చిరిగిపోయేలా కొట్టాడు. కానీ, కీబోర్డులు విరగడం అనేది వినడానికే ఆశ్చర్యంగా ఉందని చెప్పొచ్చు.