యంగ్ హీరోతో తెలుగమ్మాయి డేటింగ్..?

Thu Jun 30 2022 12:00:01 GMT+0530 (IST)

Telugu Actress Dating with Young Hero

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ కు ఊహాగానాలకు కొదువ ఉండదు. సినిమాల్లో కలిసి నటించిన ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు బయట తిరుగుతూ కనిపించినా.. వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని పుకార్లు పుట్టుకొస్తుంటాయి.అప్పుడప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆ జంటకు నిశ్చితార్థం జరిగిపోయిందని.. రహస్యంగా పెళ్లి కూడా చేసేసుకున్నారని రూమర్స్ క్రియేట్ చేస్తారు. చిత్ర పరిశ్రమలో ప్రేమలు సహజీవనాలు బ్రేకప్స్ అనేవి చాలా కామన్ కాబట్టే.. మన గాసిప్ రాయుళ్లు అలాంటివి ప్రచారం చేస్తుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరో ఒకరు ఓ అప్ కమింగ్ తెలుగు హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారనే ఓ హాట్ గాసిప్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ హీరో.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. మరోవైపు మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కుర్ర బ్యూటీ.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది.

అయితే వీరిద్దరూ గతంలో ఓ సినిమాలో జంటగా కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఆ తెలుగమ్మాయి ప్రస్తుతం పలు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఓ ఒరిజినల్ తో మంచి బ్రేక్ దొరుకుతుందని నమ్మకంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.