Begin typing your search above and press return to search.

నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్ప‌వాః హీరోయిన్ క్రేజీ ఆన్స‌ర్

By:  Tupaki Desk   |   17 Jun 2021 1:30 AM GMT
నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్ప‌వాః  హీరోయిన్ క్రేజీ ఆన్స‌ర్
X
చాలా మంది బ‌య‌ట‌ప‌డ‌రుకానీ.. వెండితెర బొమ్మ‌ల‌ను చూసి మ‌న‌సు పారేసుకుంటారు. క‌త్తిలాంటి ఫిగ‌రు అని టెంప్ట్ అయ్యేవారు కొంద‌రైతే.. మ‌న‌సులో గుడిక‌ట్టి ఆరాధించేవారు మ‌రికొంద‌రు. అవ‌కాశం ఉంటే.. ఏకంగా పెళ్లి చేసుకోవాల‌ని కూడా కొంద‌రు ఆశిస్తుంటారు. ఈ కోవ‌కే చెందిన ఓ వ్య‌క్తి.. హీరోయిన్ కు ఏకంగా మ్యారేజ్ ప్ర‌పోజ్ చేశాడు.

త‌మిళ్ హీరోయిన్ ప్రియా భ‌వానీ శంక‌ర్ పై మ‌న‌సుతో స‌హా అన్నీ పారేసుకున్న అభిమాని.. ఆమెను పెళ్లి చేసుకోవాల‌నే కోరిక‌ను వ్య‌క్తంచేశాడు. అదికూడా నేరుగా ఆమెతోనే చెప్పేవాడు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో క్వ‌శ్చ‌న్ అవ‌ర్ నిర్వ‌హించిందీ బ్యూటీ. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిస్తూ వ‌చ్చింది. అయితే.. ఓ అభిమాని ఏకంగా నిన్ను పెళ్లి చేసుకోవాల‌ని ఉంది అన్నాడు.

''మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి'' అని అడిగాడు. దీనికి ప్రియా ఏమ‌ని రిప్లే ఇచ్చిందంటే.. ''నాతో ప్రయాణం కొత్తవారికి కష్టమే. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడం ఎలా అన్న‌ది తెలియ‌క‌పోవ‌డ‌మే మీకు మంచిది. సుర‌క్షితం కూడా'' అని సమాధానం ఇచ్చింది.

బుల్లితెర నుంచి వెండితెర వైపు ప్రయాణించిన ఈ బ్యూటీ.. చూడ చ‌క్క‌నైన రూపంతోపాటు మంచి న‌ట‌న క‌న‌బ‌రుస్తూ పాపుల‌ర్ అయ్యింది. ఈ బ్యూటీ న‌టించిన సినిమాలు నాలుగు విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ తో 'అహం బ్రహ్మస్మీ' చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం.