Begin typing your search above and press return to search.

ఇష్క్ పోస్టర్ టాక్: 'లవ్ స్టోరీ' కాదంటూ ఆసక్తిరేపుతున్న హీరో

By:  Tupaki Desk   |   5 March 2021 5:37 AM GMT
ఇష్క్ పోస్టర్ టాక్: లవ్ స్టోరీ కాదంటూ ఆసక్తిరేపుతున్న హీరో
X
తెలుగు ఇండస్ట్రీలో మెల్లమెల్లగా సినీ అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అవుతున్నారు యువనటులు తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్. ఇద్దరూ ఈ ఏడాది హీరోహీరోయిన్లుగా కెరీర్ ప్రారంభించారు. ఇటీవలే జాంబిరెడ్డి సినిమాతో డెబ్యూ హిట్టు కొట్టాడు తేజ. ఫస్ట్ మూవీనే హిట్ అవ్వడంతో తదుపరి సినిమాలపట్ల వేగం పెంచినట్లే అనిపిస్తుంది. ఆల్రెడీ జాంబిరెడ్డి విడుదలకు ముందే తేజ రెండో సినిమా మొదలుపెట్టాడు. అలాగే హీరోయిన్ ప్రియా వారియర్ కూడా ఈ ఏడాది చెక్ సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ చేసింది. ఆ సినిమా ఫలితం పక్కనపెడితే అమ్మడికి మాత్రం అవకాశాలు బాగానే వస్తున్నాయట. ప్రియా కూడా ఫస్ట్ మూవీ రిలీజ్ ముందే రెండో సినిమా ఓకే చేసింది. ప్రస్తుతం తేజ సజ్జా - ప్రియా వారియర్ జంటగా 'ఇష్క్' అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇష్క్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తే మంచి యూత్ ఫుల్ మూవీలా అనిపిస్తుంది. కానీ హీరో కాస్త సీరియస్ లుక్కులో.. హీరోయిన్ నవ్వుతూ కనిపించడం వెనక ఏదో బలమైన స్టోరీ ఉందని అర్ధమవుతుంది. పోస్టర్ తోనే సినిమా పై ఆసక్తిరేపే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ సినిమాతో నూతన దర్శకుడు ఎస్ఎస్ రాజు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇష్క్ అనే టైటిల్ చూడగానే అందరూ రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ 'ఇది లవ్ స్టోరీ కాదు' అనే ట్యాగ్ లైన్ తో ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తేజ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం. జాంబిరెడ్డితో లాభాలే చూసాడట ఆ నిర్మాత. గతంలో ఇష్క్ టైటిల్ తో నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇష్క్ కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.