తెలుగమ్మాయి `కమిట్ మెంట్` వీరలెవల్లో

Fri Jul 03 2020 10:00:46 GMT+0530 (IST)

Tejaswi Madiwada Commitement First Look Released

వెండితెరపై శృంగార రసానికి ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. ఇటీవలి కాలంలో పెద్ద తెర-బుల్లితెర-ఓటీటీలో శృంగారానిదే అగ్రతాంబూలం. రోమాంచితమైన థ్రిల్లింగ్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తేనే యూత్ అడిక్ట్ అవుతున్నారు. అందుకే ఆ కోవలో సినిమాల్ని తీసేందుకు మన దర్శకులు వెనకడుగు వేయడం లేదు. ఈ జోనర్ లో తెరకెక్కిస్తున్న తాజా వెబ్ ఆంథాలజీ సిరీస్ `కమిట్మెంట్`. నలుగురు అమ్మాయిల్ని తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ వెబ్ ఆంథాలజీ ప్రత్యేక పోస్టర్ కొంతకాలం క్రితం విడుదలైంది. పోస్టర్ కి చక్కని స్పందన లభించింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయిలు తేజస్వి మాదివాడ.. రమ్య పసుపులేటి వేర్వేరు ఎపిసోడ్లలో నటించారు.తాజాగా (జూలై 3) తేజస్వి పుట్టినరోజు సందర్భంగా `కమిట్ మెంట్` నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో తేజస్వి బోల్డ్ లుక్ లో కనిపిస్తోంది. తెలుగమ్మాయి ఏమాత్రం బిడియపడక బికినీలో థై సొగసుల్ని ఎలివేట్ చేయడం చూస్తుంటే వేడెక్కించే సన్నివేశాలతో ట్రీటివ్వనుందని క్లారిటీ వచ్చేసింది. మును పటి పోస్టర్ మాదిరి గానే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా యువతరం దృష్టి ని వీర లెవల్లో ఆకర్షిస్తోంది.

మరో తెలుగమ్మాయి రమ్య పసుపులేటి.. హిందీ భామలు సిమార్ సింగ్ - అన్వేషి జైన్ ఇతర ఎపిసోడ్లలో ప్రధాన పాత్ర లో నటించారు. హైదరాబాద్ నవాబ్స్ ఫేం లక్ష్మీకాంత్ చెన్నా రచన .. దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించారు. సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా.. నరేష్ రానా.. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.