ఫొటోటాక్ : సరికొత్త అందాల ప్రదర్శణ

Mon Aug 10 2020 16:28:33 GMT+0530 (IST)

PhotoTalk: The newest beauty

తెలుగమ్మాయి తేజస్వి మడివాడ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంది. ఈ అమ్మడి అందాల ప్రదర్శణతో ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇటీవల మరో ఫొటోను తేజస్వి షేర్ చేసింది. ఈసారి ఇటుకలపై కూర్చుని ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది. గోధుమ వర్ణంలో ఈ అమ్మడి డ్రస్ అదిరింది. క్యూట్ లుక్ తో పాటు క్లీ వేజ్ షో తో కూడా తేజస్వి కుర్రకారు హృదయాలను మెలి పెడుతున్నట్లుగా ఉంది. ఆమె చూపుల్లో మత్తు ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నటిగా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ ద్వారా అయినా ఏమైనా లక్ కలిసి వస్తుందేమో అనుకుంటే అది కూడా ఆమెకు చెడ్డ పేరును తెచ్చి పెట్టింది. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 లో ఈ అమ్మడు ఉన్న కొన్ని రోజులు అయినా ఎంటర్‌టైన్ చేసింది. కాని చాలా త్వరగా ఎలిమినేట్ అవ్వడంతో నిరాశ కలిగించింది. తన ముక్కుసూటి తనం వల్ల అందులో నుండి త్వరగా బయటకు వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా ఫ్యాన్స్ కు చేరువగా ఉంటోంది.