Begin typing your search above and press return to search.

నిజాయితీ నిల‌బెడుతుంది.. అదే కాన్పిడెన్స్ తో అభిరాం!

By:  Tupaki Desk   |   29 May 2023 11:56 AM GMT
నిజాయితీ నిల‌బెడుతుంది.. అదే కాన్పిడెన్స్ తో అభిరాం!
X
ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ సినిమా గురించి ఆ చిత్ర యూనిట్ ఏ రేంజ్ లో వాయించేస్తుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మా సినిమా క‌న్నా గొప్ప సినిమా మ‌రొక‌టి లేదు అన్న‌ట్లే చెబుతారు. దీనికి సినిమా రేంజ్ తో ప‌నిలేదు. చిన్న హీరో అయినా..పెద్ద హీరో అయినా ..ఏ డైరెక్టర్ అయినా స‌రే రిలీజ్ కి ముందు మీడియాతో అలా మాట్లాడాల్సిందే. లేదంటే నిర్మాత కోట్ల‌లో న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. త‌ద్వారా చిత్ర యూనిట్ మొత్తానికి అదో బ్యాడ్ నేమ్. సినిమా పోతుంద‌ని తెలిసినా? కూడా రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితులు కొన్ని ఉంటాయి ఇటీవ‌ల గోపీచంద్ చెప్పిన‌ట్లు.

తాజాగా నిన్న‌టి రోజున 'అహింస' ప్రీ రిలీజ్ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు తేజ చేసిన నిజాయితీగ‌ల వ్యాఖ్య‌లు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా రిలీజ్ కి ముందు ఎవ‌రూ ఇలా మాట్లాడ‌రు. కానీ తేజ కాస్త డిఫ‌రెంట్ కాబ‌ట్టి ఉన్న విష‌యాన్ని ఓపెన్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అహింస గురించి అలాగే స్పందించారు. దీంతో ఆయ‌న‌పై నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది.

సినిమా గురించి ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికి ఉలికెందుకున్న‌ట్లు! ఆయ‌నేదో బ్ర‌హ్మ ర‌హ‌స్యం చెప్పిన‌ట్లు సోష‌ల్ మీడియాలో స‌న్నివేశం క్రియేట్ అవుతుంది. రిలీజ్ కి ముందు ఇలా ఎలా మాట్లాడుతారు సార్ అంటూ! కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఇలా నెట్టింట ఇంత జ‌రుగుతున్నా హీరో అభిరాం మాత్రం కామ్ గానే ఉన్నాడు. త‌న సినిమా పై ఎలాంటి నెగిటివిటీ వ‌చ్చినా ప‌ట్టించుకోలేదు. అన్నింటికి విజ‌యం ఒక్క‌టే స‌మాధానం చెబుతుంద‌ని మౌనం వ‌హిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు.

తేజ నిజాయితీ..అభిరాం ప్ర‌తిభ మాత్ర‌మే సినిమాని నిల‌బెడ‌తాయ‌ని తేజ నిజాయితీ...అభిరాం మౌనం మాటున క‌నిపిస్తున్నాయని ద‌గ్గుబాటి ఫాలోవ‌ర్స్ భావిస్తున్నారు . ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న‌మైన సినిమాలెన్నో ఉన్నాయి.

ఆ జాబితాలో 'అహింస' చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌స‌రం లేదు. తేజ యూత్ ఫుల్ కంటెంట్ క‌నెక్ట్ అయిందంటే? బాక్సాఫీస్ లెక్క మారిపోతుంది సుమీ. 'చిత్రం'..'నువ్వు నేను' లాంటి సినిమాలు అలా వ‌చ్చి స‌క్సెస్ అయిన‌వే క‌దా. 'అహింస' అంత‌కు మించి విజ‌యం సాధించాల‌ని ఆశిద్దాం.